వసతి గృహాల్లో అడ్మిషన్లు పూర్తి చేయండి: సీఎస్
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:57 AM
రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు.
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు, భోజన వసతి, వాటి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ముఖ ఆధారిత హాజరు విధానాన్ని (ఎఫ్‌ఆర్‌ఏఎస్) ఆర్టీజీఎ్‌సతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలన్నారు. భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులందరికీ ఆప్కో ద్వారా బెడ్ షీట్లు, కార్పెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.
Updated Date - Jul 09 , 2025 | 05:58 AM