ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam: క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 13 మంది అరెస్టు

ABN, Publish Date - Jun 18 , 2025 | 07:03 AM

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 13 మందిని విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారికి మ్యూల్‌ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్న...

ఎండాడ (విశాఖపట్నం), జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 13 మందిని విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారికి మ్యూల్‌ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్న అనకాపల్లి జిల్లా కశింకోటకు చెందిన ఒకరిని ఇటీవల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతన్ని విచారించగా బెంగళూరులోని బిలేకహళ్లిలో డెన్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. సాంకేతికతను వినియోగించి డెన్‌పై సైబర్‌క్రైం పోలీసులు దాడి చేసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 13 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు 45 సెల్‌ ఫోన్లు, 130 బ్యాంకు పాస్‌బుక్‌లు, 4 ల్యాప్‌టాప్‌లు, 33 ఏటీఎం కార్డులు, రెండు కౌంటింగ్‌ మెషీన్లను సీజ్‌ చేశారు. వీరంతా పలు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. పరిచయాలు పెంచుకుని మ్యూల్‌ అకౌంట్లను సేకరించి వారిని బెట్టింగ్‌ కార్యకలాపాలకు వినియోగిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. వీరంతా బృందాలుగా ఏర్పడి.. రెడ్డి అన్నా 462, బెట్‌ భాయ్‌ బుక్‌ 52 పేరుతో వెబ్‌సైట్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 07:04 AM