ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Public-Private Partnership: సీఆర్‌డీఏకు నాబ్‌ఫిడ్‌ తోడు

ABN, Publish Date - Jul 12 , 2025 | 06:02 AM

అమరావతి నగరాన్ని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్న ఏపీసీఆర్‌డీఏ లక్ష్యంలో భాగస్వామి కావడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌...

  • రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సేవలు

  • సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): అమరావతి నగరాన్ని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్న ఏపీసీఆర్‌డీఏ లక్ష్యంలో భాగస్వామి కావడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్మెంట్(నాబ్‌ఫిడ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ్‌కిరణ్‌రాయ్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సీఆర్‌డీఏ ట్రాన్సాక్షన్‌ సలహా సర్వీసుల (టీఏఎస్‌) కోసం నాబ్‌ఫిడ్‌తో శుక్రవారం ఓ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎండీ మాట్లాడుతూ.. తమ ట్రాన్సాక్షన్‌ సలహా సేవల ద్వారా కొత్త రకమైన ఫైనాన్స్‌ మోడళ్లను రూపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టు అని చెప్పారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన విత్త మూలాలను సమర్థవంతంగా వినియోగించేందుకు నాబ్‌ఫిడ్‌తో ఒప్పందం ఓ ముందడుగు అవుతుందన్నారు. ఆ సంస్థ నైపుణ్యం ద్వారా సీఆర్‌డీఏ నాణ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయగలుగుతుందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహాయం విషయంలో వ్యూహాత్మక సలహాదారుగా పనిచేసే నాబ్‌ఫిడ్‌.. అమరావతి అభివృద్ధి కోసం విత్త ప్రణాళిక రూపకల్పనలో సీఆర్‌డీఏకి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ సహకార ఒప్పందంలో భాగంగా, విభిన్న మోడళ్లలో (పీపీపీ సహా) అమలు చేయదగిన విధానాలను అంచనా వేసి, పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఆర్థిక వ్యూహాలను రూపొందించేందుకు సాయం చేస్తుంది. అందుబాటులో ఉన్న భూసంపద మోనిటైజేషన్‌ అవకాశాలను పరిశీలించడం, ఆదాయ వనరులను గుర్తించడం వంటి అంశాల్లో కూడా సంస్థ సహకారం అందిస్తుంది. ఇంకా వివిధ ప్రాజెక్టులకు అవసరమైన ఫైనాన్షియల్‌ మోడళ్ల రూపకల్పనలో, సంబంధిత స్టేక్‌హోల్డర్లు, పెట్టుబడిదారులతో నడిచే సమగ్ర సంప్రదింపులకు ఈ సంస్థ సీఆర్‌డీఏకి మార్గదర్శిగా నిలుస్తుంది. అమరావతి నగర అభివృద్ధికి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర విత్త ప్రణాళిక రూపొందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:06 PM