CPI Leader Ramakrishna : సీమ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్లు కేటాయించాలి
ABN, Publish Date - Jan 28 , 2025 | 06:34 AM
వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టును సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
కొండాపురం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రానున్న బడ్డెట్‌లో మొదటి ప్రాధాన్యంగా రాయలసీమ ప్రాజెక్టులకు రూ.20,000 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టును సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం శీతకన్ను వేసిందని విమర్శించారు. రాయలసీమలో వలసలను ఆపాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చంద్రబాబు ప్రభుత్వం దృష్టిపెట్టిందని.. ఇది సరైన పద్ధతి కాదని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరారు. హంద్రీ-నీవా కాలువల కింద ఒక్క ఎకరా ఆయకట్టు కూడా అభివృద్ధి చేయలేదన్నారు. గండికోట ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినా, దానిలో అంతర్భాగమైన వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. పది సంవత్సరాలుగా గండికోట ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నా నిర్వాసితులకు న్యాయం జరగలేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 28 , 2025 | 06:34 AM