ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CPI: దేశాన్ని అదానీకి దోచిపెడుతున్న మోదీ: సీపీఐ రామకృష్ణ

ABN, Publish Date - Mar 24 , 2025 | 02:58 AM

అనంతపురంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ... మోదీ దేశానికి చేసిందేమీ లేదని, ఎన్నికల వాగ్దానాలేవీ అమలు చేయలేదని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు.

అనంతపురం విద్య, మార్చి 23(ఆంధ్రజ్యోతి): దేశ సంపదను ప్రధాని మోదీ.. అదానీకి దోచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ... మోదీ దేశానికి చేసిందేమీ లేదని, ఎన్నికల వాగ్దానాలేవీ అమలు చేయలేదని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఏప్రిల్‌ 14 వరకూ 26 జిల్లాల్లో ప్రచారం చేస్తామని తెలిపారు. గడిచిన 7 నెలల్లో ఏపీకి రూ.3 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ చెబుతోందని, ఆ నిధులు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. కేంద్రంలోని ఎన్డీఏ, ఏపీలో కూటమి డబుల్‌ ఇంజన్‌ సర్కారంటూ చంద్రబాబు, పవన్‌ చెబుతున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎర్ర జెండా పార్టీలతో ఏకమై... తాము కూడా డబుల్‌, ట్రిపుల్‌ ఇంజన్‌తో కొడతామంటూ రామకృష్ణ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 02:58 AM