ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Emotional plea: కోర్టు హాల్లో చెవిరెడ్డి కంటతడి

ABN, Publish Date - Jul 23 , 2025 | 04:34 AM

మద్యం స్కాం నిందితుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట కంటతడి పెట్టుకున్నారు. నిందితులందరినీ కోర్టు హాల్లో...

  • న్యాయాధికారికి వాదనను వినిపిస్తూ భావోద్వేగం

  • తన తండ్రి మద్యం వ్యాపారం చేశారని,బాగా డబ్బులు వస్తాయన్నా తాను ఆ వ్యాపారం చేయలేదని వెల్లడి

విజయవాడ, జూలై 22(ఆంధ్రజ్యోతి): మద్యం స్కాం నిందితుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట కంటతడి పెట్టుకున్నారు. నిందితులందరినీ కోర్టు హాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక్కొక్కరూ తమ వాదనను వినిపించారు. చెవిరెడ్డి తన వాదన వినిపిస్తూ.. తన తండ్రి మద్యం వ్యాపారం చేశారని, ఆ వ్యాపారం చేయాలని, బాగా డబ్బులు వస్తాయని తనకూ చెప్పారని అన్నారు. తండ్రి, తమ్ముడు మద్యం కారణంగానే చనిపోయారన్నారు. నాటినుంచి తాను మద్యం జోలికి వెళ్లలేదన్నారు. తనకు మద్యం కేసుతో సంబంధం లేదన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. రిమాండ్‌ను పొడిగించాక కుటుంబ సభ్యులతో భేటీ అయ్యేందుకు ఆయనకు సమయం ఇచ్చారు. చెవిరెడ్డితో ఆయన సతీమణి, చిన్న కుమారుడు మాట్లాడారు.

‘లిక్కర్‌’ నిందితుల రిమాండ్‌ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను ఆగస్టు 1వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులిచ్చారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్‌, కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌నాయుడు, బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌ కృష్ణను పోలీసులు మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, బెయిల్‌ ఇప్పించాలని దిలీప్‌ విన్నవించాడు. బెయిల్‌ పిటిషన్‌పై త్వరలో తీర్పు వెలువరిస్తానని న్యాయాధికారి అన్నారు.

చెవిరెడ్డి బెయిల్‌పై తీర్పు 28కి వాయిదా

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పును ఈనెల 28కి వాయిదా వేశారు. చెవిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. చెవిరెడ్డిపై నమోదైన అన్ని కేసులను కోర్టులు కొట్టేశాయని తెలిపారు. దీనికి ప్రాసిక్యూషన్‌ తరఫున రాజేంద్రప్రసాద్‌ అభ్యంతరం చెప్పారు. చెవిరెడ్డిపై నమోదైన 40 శాతం కేసుల్లో ఇంకా తీర్పులు రాలేదన్నారు. కాగా, జైల్లో వంట చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ చెవిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయాధికారి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 23 , 2025 | 04:38 AM