ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Advocate General: పదోన్నతులపై కోర్టు ఉత్తర్వులు మూడునెలల్లో అమలు చేస్తాం

ABN, Publish Date - Jul 08 , 2025 | 06:15 AM

ఉద్యోగులకు పదోన్నతి కల్పించే విషయంలో ఉమ్మడి హైకోర్టు 2018 ఇచ్చిన తీర్పును సానుకూలంగా మూడునెలల్లో అమలు చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ సోమవారం హైకోర్టుకు నివేదించారు.

  • హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్‌ జనరల్‌.. విచారణ సెప్టెంబరు 1కి వాయిదా

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు పదోన్నతి కల్పించే విషయంలో ఉమ్మడి హైకోర్టు 2018 ఇచ్చిన తీర్పును సానుకూలంగా మూడునెలల్లో అమలు చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఉత్తర్వుల అమలు పురోగతిని కోర్టు ముందు ఉంచేందుకు విచారణను ఐదు వారాలకు వాయిదా వేయాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ జగడం సుమతితో కూడిన ధర్మాసనం విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటిం చింది. పదోన్నతుల్లో తమకు అన్యా యం జరిగిందంటూ పలువురు ఉద్యోగులు 2016, 2017లో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు, పదోన్నతుల్లో అన్ని వర్గాల ఉద్యోగులకు తగినంత ప్రాతినిఽథ్యం ఉందా?లేదా? అనే విషయాన్ని కనీస అధ్యయనం చేయకుండా రిజర్వేషన్‌ కల్పించారని తప్పు పట్టింది. బాధిత ఉద్యోగుల వాదన విని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు అనుగుణంగా ప్రతి ఉద్యోగి పదోన్నతినీ సమీక్షించాలని ఆదేశించింది. రిజర్వ్‌ కేటగిరీ ఉద్యోగులు పరిమితికి మించి పదోన్నతులు పొందినట్టయితే, రిజర్వేషన్‌ పరిధిలోకి రాని ఇతర ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ 2018 డిసెంబరు 11న తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో ద సెక్రెటేరియట్‌ బీసీ అండ్‌ ఓసీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, మరికొందరు ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చాయి.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.... ఉత్తర్వుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీల మీద కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం సమస్యను జటిలం చేస్తుందన్నారు. సెక్రెటేరియట్‌ ఉద్యోగులకు పదోన్నతి కల్పన గురించి మాత్రమే కమిటీ వేశారని, రాష్ట్రంలోని 31 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రారంభించలేదన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... కోర్టు ధిక్కరణ కింద అధికారులను బాధ్యులను చేసి శిక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అయితే, తీర్పును అమలు చేయమని కోరుతున్నారా?లేక శిక్ష విధించమని కోరుతున్నారా? అని పిటిషనర్లను ప్రశ్నించింది. గత ఆరేళ్లుగా ఉత్తర్వులు అమలు కాలేదని, అప్పటి నుండి కోర్టుధిక్కరణ పిటిషన్లు విచారణకు వచ్చేందుకు కూడా పిటిషనర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. సూపర్‌ న్యూమరీ పోస్టులు క్రియేట్‌ చేయడం చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను మూడునెలల్లో సానుకూలంగా అమలు చేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని ఏజీ కోరుతున్నప్పుడు తాము నిరాకరించలేమని బెంచ్‌ పేర్కొంది. విచారణను వాయిదా వేసింది.

Updated Date - Jul 08 , 2025 | 06:15 AM