Annavaram: కాంట్రాక్టర్‌పై వైసీపీ నేత దాడిశెట్టి రాజా అనుచరుల దాడి
ABN, Publish Date - Aug 03 , 2025 | 04:37 AM
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ కాంట్రాక్టర్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా అనుచరులు దాడికి పాల్పడ్డారు.
అన్నవరం దేవస్థానంలో టెండర్ సమయంలో ఘటన
అన్నవరం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ కాంట్రాక్టర్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా అనుచరులు దాడికి పాల్పడ్డారు. అన్నవరంలోని వ్రత మండపాల్లో వ్రతం అనంతరం భక్తులు వదిలివెళ్లిన మారేడు, జమ్మి పత్రితో పాటు స్వామివారి అలంకరణ అనంతరం వాడిపోయిన పువ్వులను పోగు చేసుకుని తీసుకెళ్లేందుకు మొదటిసారిగా టెండర్ కం బహిరంగ వేలం శనివారం నిర్వహించారు. ఇందులో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన ఒకరు, తిమ్మాపురానికి చెందిన ఇంకొందరు పాల్గొన్నారు. ద్వారకా తిరుమలకు చెందిన రాజేష్ అనే వ్యక్తి సీల్డ్ టెండర్‌లో నెలకు రూ.45,000 దేవస్థానానికి చెల్లించేలా హెచ్చు మొత్తంలో సీల్డ్ టెండర్ వేశారు. మిగిలిన ఇద్దరు వైసీపీకి చెందిన వ్యక్తులు రూ.35,000, రూ.30,000కు కోట్ చేశారు. వీరిద్దరిలో ఒకరు ఇంతకుముందు వైసీసీ హయాంలో ఒక లీజు లైసెన్స్ పొంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. దీంతో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ టెండర్ అధికంగా వేస్తావా అంటూ కొండపై వేలం నిర్వహించే ప్రాంగణంలోనే ఇద్దరూ కలిసి రాజేష్‌పై దాడి చేశారు. తర్వాత రాజేష్ వర్గీయులు కూడా ప్రతి దాడి చేశారు. ఇరువర్గీయులు అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
Updated Date - Aug 03 , 2025 | 04:40 AM