ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: జోరుగా వర్షాలు

ABN, Publish Date - May 22 , 2025 | 04:27 AM

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయి. త్వరలో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముండడంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేడు అరేబియా సముద్రంలో అల్పపీడనం

రెండు రోజుల్లో బంగాళాఖాతంలోనూ!

కేరళలో రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలం

విశాఖపట్నం, అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐదారు రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన మే నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందంటున్నారు. ఒకవేళ వర్షాలు తగ్గుముఖం పడితే కొన్నిచోట్ల ఎండల ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల కలయికతో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కోస్తాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాత్రికి కొన్నిచోట్ల వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52, అనకాపల్లిలో 50, ప్రకాశం జిల్లా డోర్నాలలో 50.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ వివరించింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.


ఉపరితల ఆవర్తనం ప్రభావం!

కర్ణాటక, గోవాకు ఆనుకుని తూర్పు అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తర్వాత 36 గంటల్లో ఉత్తరంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడుతుంది. దీని ప్రభావంతో కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా మారనుంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత నైరుతి రుతుపవనాల ప్రవేశంపై భారత వాతావరణ శాఖ ప్రకటన చేస్తుందని అంచనావేస్తున్నారు. రెండు రోజుల నుంచి కేరళ, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 04:28 AM