సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి: మంత్రి
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:55 PM
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
బనగాన పల్లె, జూన 27 ( ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఉద్యోగులు బీసీకి వినతిపత్రం సమర్పించారు. 2006 నుంచి తాము పని చేస్తున్నామని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఉపాధి సిబ్బందికి హామీ ఇచ్చారు. బాఽధితుల వినతులు స్వీకరించి అప్పుటికప్పుడే కొన్ని సమస్యలను అధికారులకు ఫోనలు చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కార్యాలయా ల చుట్టూ తిప్పవద్దని ఆదేశించారు. సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలి
పట్టణంలో అండర్ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి కోరారు. శుక్రవారం పాతబస్టాండ్ సమీపంలోని డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. ప్రజల సౌకర్యార్థం పట్టణంలో జరగుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
Updated Date - Jun 27 , 2025 | 11:55 PM