Job Controversy: వైద్యుల నియామకంపై అభ్యంతరాలు
ABN, Publish Date - Jul 13 , 2025 | 05:06 AM
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నోటిఫికేషన్ రద్దుకు జీడీఏ డిమాండ్
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ మాత్రమే చేపట్టాలి. కానీ, డీఎంఈ అధికారులు ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల17వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూల నిర్వహణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.దీనిపై ప్రభుత్వ వైద్యుల సంఘం(జీడీఏ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటే భవిష్యత్తులో సీనియార్టీ సమస్యలు వస్తాయని సంఘం సభ్యులు చెబుతున్నారు.నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 05:07 AM