మహిళా భద్రత, చట్టాలపై సమగ్ర అవగాహన అవశ్యం: శైలజ
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:22 AM
మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపొదించింది. వాటిపై ప్రతి ఒక్కరూ సమగ్ర అవగాహన కలిగి ఉండాలి’ అని రాష్ట్ర మహిళా చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు.
నంద్యాల, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపొదించింది. వాటిపై ప్రతి ఒక్కరూ సమగ్ర అవగాహన కలిగి ఉండాలి’ అని రాష్ట్ర మహిళా చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం ఆమె నంద్యాల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ... ‘మహిళలపై సంఘటనలు జరిగినప్పుడే కాకుండా అనునిత్యం అప్రమత్తంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీమ జిల్లాలో విద్యార్థులకు మహిళా భద్రతా, సాధికారితపై అవగాహన కల్పిస్తున్నాం. వెలిగొండలో బాలికపై జరిగిన ఘటనను సుమోటోగా తీసుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడో ఏదో జరిగితే వెంటనే ప్రభుత్వానికి అంటగట్టడం సరికాదు’ అని శైలజా అన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 05:22 AM