Comprehensive Report: అటవీ ప్రాంతాలపై సమగ్ర నివేదిక తయారీకి కమిటీ నియామకం
ABN, Publish Date - Aug 02 , 2025 | 06:57 AM
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అటవీ ప్రాంతాలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమిటీని నియమించింది.
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అటవీ ప్రాంతాలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమిటీని నియమించింది. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 10 మంది సభ్యులు ఉంటారు. చట్ట ప్రకారం గుర్తించబడిన, వర్గీకరించబడిన, భూయాజమాన్యంతో సంబంధం లేకుండా ’అడవి’గా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, గతంలో అడవిగా ఉండి, క్షీణించిన, తొలగించబడిన, శుభ్రం చేయబడిన భూమిగా మారిన ప్రాంతాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన తోటలు, తీగ చెట్లతో కప్పబడిన ప్రాంతాలను గుర్తించి, నెలలోగా నివేదిక సమర్పిచాలని ప్రభుత్వం నిర్దేశించింది. భూపరిపాలన శాఖ అడిషనల్ చీఫ్ కమిషనర్ చైర్మన్‌గా మరో కమిటీని నియమించింది. దీనిలో సీసీఎల్‌ఏ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతినిఽధులు సభ్యులుగా ఉంటారు.
Updated Date - Aug 02 , 2025 | 06:59 AM