ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీల పరిష్కారంపై కలెక్టర్‌ అసంతృప్తి

ABN, Publish Date - May 20 , 2025 | 12:06 AM

పీజీఆర్‌ఎస్‌ లాగినలో వచ్చిన సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌ రంజిత బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ రంజిత బాషా

పదిరోజుల్లో పరిష్కరించాలని ఆదేశం

కర్నూలు కలెక్టరేట్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌ లాగినలో వచ్చిన సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌ రంజిత బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్‌ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌ లాగినలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడానలి చెప్పినప్పటికీ కొన్నిశాఖల అధికారులు వారం, పది రోజులైనా చూడడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీడీపీవో కర్నూలు అర్బన, ఆదోని మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌ కర్నూలు అర్బన, డిప్యూటీ కంట్రోలర్‌, లీగల్‌ మెట్రాలజీ శాఖలకు సంబంధించి వారం నుంచి పది రోజులైనా అర్జీలను చూడలేదని, అర్జీలను చూడకుంటే ఎలాగని ప్రశ్నించారు. ప్రజల అర్జీలకు సంబంధించి నిర్లక్ష్యం చేయకూడదని, లాగినలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ లాగినలో అర్జీలను ఆడిట్‌ చేయాలన్నారు. రీసర్వే గ్రామ సభలకు సంబంధించి రీ ఓపెన అయిన అర్జీలు వెంటనే పరిష్కరించాలని సర్వే శాఖ అధికారిని ఆదేశించారు. సీఎంవో గ్రీవెన్సలకు సంబంధించి ఆదోని సబ్‌ కలెక్టర్‌ వద్ద 20, కర్నూలు ఆర్డీవో వద్ద 10, పత్తికొండ ఆర్డీవో వద్ద 7, సర్వే ఏడీ వద్ద 2, డీఎంహెచవో, వ్యవసాయశాఖ, మెప్మా, సైనిక సంక్షేమ శాఖ వద్ద ఒక్కొక్కటి చొప్పు అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 12:06 AM