ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cognizant: వైజాగ్‌కు కాగ్నిజెంట్‌

ABN, Publish Date - Jun 21 , 2025 | 03:48 AM

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో ప్రఖ్యాత ఐటీ కంపెనీ రానుంది. ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్‌ ముందుకు వచ్చింది. రూ.1,582 కోట్ల పెట్టుబడితో 8,000 మంది యువతకు ఉద్యోగాలను కల్పించనుంది.

1,582 కోట్ల పెట్టుబడి .

8,000 ఉద్యోగాలు

ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు సుముఖత ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభం విశాఖలో ఎకరా 99 పైసలు చొప్పున

21.31 ఎకరాల కేటాయింపు: లోకేశ్‌

ఇప్పటికే టీసీఎ్‌సకు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి/విశాఖపట్నం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో ప్రఖ్యాత ఐటీ కంపెనీ రానుంది. ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్‌ ముందుకు వచ్చింది. రూ.1,582 కోట్ల పెట్టుబడితో 8,000 మంది యువతకు ఉద్యోగాలను కల్పించనుంది. ఈ మేరకు కాగ్నిజెంట్‌ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖలో తన కార్యకలాపాల కోసం 21.31 ఎకరాల భూమి కావాలని కాగ్నిజెంట్‌ కోరిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని గురువారం నాడు రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా 8,000 మందికి ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే కాగ్నిజెంట్‌ సంస్థకు ఎకరా 99 పైసలు చొప్పున 21.31 ఎకరాలను కేటాయించాలని ఎస్‌ఐపీబీ తీర్మానించిందని లోకేశ్‌ వెల్లడించారు. కాగ్నిజెంట్‌ తన కార్యకలాపాలను 2029 నుంచి వైజాగ్‌లో ప్రారంభిస్తుందని తెలిపారు. విశాఖ పర్యటనలో కూడా మంత్రి లోకేశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎప్పటి నుంచో కాగ్నిజెంట్‌ విశాఖపట్నం వస్తామని చెబుతోందని, ఇప్పుడది సాకారమైందని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తున్న కృషి ఫలిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పటికే టీసీఎస్‌...

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.1,370 కోట్ల పెట్టుబడులతో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా విశాఖలో కార్యాలయం స్థాపనకు టీసీఎస్‌ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలు చొప్పున దాదాపు 22 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ కూడా విశాఖలో రూ.1,582 కోట్ల పెట్టుబడితో దశలవారీగా 8,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా క్యాంపస్‌ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. ఈ సంస్థకు కూడా కాపులుప్పాడలో స్థలం కేటాయించాలని నిర్ణయించారు. వీఎంఆర్‌డీఏ ఇందుకు సానుకూలంగా స్పందించింది. విశాఖకు ఈ రెండు కంపెనీల రాకతోనే 20,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇన్ని వేలమంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు విశాఖకు తరలి వస్తే నగర విస్తరణ, ఆర్థిక కార్యకలాపాలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించుకోవచ్చని లోకేశ్‌ పేర్కొన్నారు. కంపెనీల రాకతో విశాఖ నగరం రూపురేఖలు మారిపోతాయని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళికంగా సముద్ర తీరాన ఉండటం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుండటం.. ఐటీ కంపెనీల రాకతో ముంబై తరహా కాస్మోపాలిటన్‌ సిటీగా విశాఖ మారుతుందని అంటున్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు

రాష్ట్రంలో యువతకు భరోసా ఇచ్చేలా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక సంస్థలు ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.28,546 కోట్ల పెట్టుబడులు, 30,270 మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. వీటిలో ప్రధానంగా రూ.1,202 కోట్లతో 6,571 మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంతో రేమండ్‌ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రేమండ్‌కు 80.77 ఎకరాలు కేటాయించారు. రూ.10,900 కోట్లతో రైవాడ వద్ద 900 మెగావాట్ల అదానీ పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌కూ ఆమోదం లభించింది.

Updated Date - Jun 21 , 2025 | 06:38 AM