CM Chandrababu: సొంత ఆదాయం పెంచుకోవాలి
ABN, Publish Date - Jul 12 , 2025 | 05:22 AM
ఆదాయార్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖల అధికారులకు సూచించారు. సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని చెప్పారు.
ప్రజలకు ఇబ్బందిలేని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి
ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఆదాయార్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖల అధికారులకు సూచించారు. సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని చెప్పారు. సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖల పనితీరుపై ఆరా తీశారు. ఆయా శాఖల్లో ఆదాయార్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘సొంత ఆదాయం పెంచడంపై దృష్టిసారించాలి. ఆదాయ ఆర్జనలో ఉన్న లీకేజీలు గుర్తించి, వాటిని నివారించి ఖజానాకు ఆదాయం పెరిగేలా చూడాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆదాయం పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. కేంద్రం నుంచి తెచ్చుకోగలిగే ప్రతి పైసాను రాష్ట్రానికి తీసుకురావాలి.’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Updated Date - Jul 12 , 2025 | 07:56 AM