ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gandikota Project: రేపు జమ్మలమడుగుకు సీఎం

ABN, Publish Date - Jul 31 , 2025 | 06:32 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో జరిగే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

  • పింఛన్ల పంపిణీ అనంతరం గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన

అమరావతి, నిడదవోలు, జూలై 30(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో జరిగే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. శుక్రవారం కడపకు చేరుకుని జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. గ్రామస్థులతో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి గండికోటకు చేరుకుంటారు. కేంద్రప్రభుత్వ సహకారంతో సాస్కీ పథకం కింద రూ.78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మంత్రి కందుల దుర్గేశ్‌ నిడదవోలులో తెలిపారు.

Updated Date - Jul 31 , 2025 | 06:34 AM