ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM chandrbabu: రేపు హంద్రీ-నీవాకు నీరు

ABN, Publish Date - Jul 16 , 2025 | 06:13 AM

మూడు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు నీరందరించే హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మల్యాల ఎత్తిపోతల నుంచి నీటి విడుదలకు సీఎం చంద్రబాబు...

  • స్వయంగా విడుదల చేయనున్న సీఎం

  • మల్యాల ఎత్తిపోతల నుంచి 2 పంపుల ద్వారా హంద్రీ-నీవా కాలువకు నీరు విడుదల

నంద్యాల, జూలై 15(ఆంధ్రజ్యోతి): మూడు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు నీరందరించే హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మల్యాల ఎత్తిపోతల నుంచి నీటి విడుదలకు సీఎం చంద్రబాబు గురువారం నంద్యాల జిల్లాకు రానున్నారు. ఈ నెల 8న శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేందుకు శ్రీశైలం పర్యటనకు వచ్చినప్పుడు.. సీమ జిల్లాలకు నెలాఖరుకల్లా కృష్ణా జలాలను తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నీరు విడుదల చేయనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా గురువారం ఉదయం 11 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టరులో నంద్యాల జిల్లా నందికొట్కూరు వస్తారు. ఆ తర్వాత మల్యాల ఎత్తిపోతల నుంచి రెండు పంపుల ద్వారా హంద్రీ-నీవా కాలువలోకి 700 క్యూసెక్కులు విడుదల చేస్తారు. రాయలసీమ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.2,647 కోట్లతో హంద్రీ-నీవా కాలువ విస్తరణ, లైనింగ్‌ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. వీటిలో 80ు పనులు పూర్తయ్యాయి. ఇంకోవైపు.. శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 200 టీఎంసీలకుపైగా నీటి నిల్వలు చేరాయి. గతంలో ఎన్నడూలేని విధంగా జూన్‌లోనే వరద నీరు చేరడంతో జలవనరుల శాఖ అధికారులు నీటి విడుదల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేయగా.. ఈ ఏడాది మాత్రం సీఎం స్వయంగా వచ్చి నెల రోజుల ముందే విడుదల చేస్తుండడంతో సీమ రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. తొలుత జలహారతి ఇచ్చాక ఎత్తిపోతల నుంచి ఆయన నీటిని విడుదల చేస్తారు. తర్వాత రైతులతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో నంద్యాల జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. 10 రోజుల వ్యవధిలో సీఎం రెండోసారి జిల్లా పర్యటనకు వస్తుండడం గమనార్హం.

Updated Date - Jul 16 , 2025 | 06:15 AM