ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు

ABN, Publish Date - May 21 , 2025 | 03:06 AM

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహాయం కోరేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీకి వెళ్లి, ఒకేరోజు ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. గోదావరి-బనకచర్ల ఎత్తిపోతల పథకం ప్రీ-ఫీజుబిలిటీ రిపోర్టును నిర్మలా సీతారామన్‌కు సమర్పించి, నిధులు కోరనున్నారు.

ఎల్లుండి ఒకేరోజు అమిత్‌షా సహా ఏడుగురు కేంద్ర

మంత్రులతో భేటీ.. బనకచర్లపై నిర్మలతోనూ..

ఏపీకి పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చర్చలు

శనివారం నీతీ ఆయోగ్‌ సమావేశానికి హాజరు

అమరావతి, ఢిల్లీ, మే 20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రసాయం కోరేందుకు చేపడుతున్న ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఒకేరోజు ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కాబోతున్నారు. గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకుని, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. అదే రోజు ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం భేటీ కానున్నారు. మరునాడు 24వ తేదీన భారత మండపంలో జరిగే నీతి అయోగ్‌ 10వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటనలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు శుక్రవారం కలుస్తారు. గోదావరి - బనకచర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రీ-ఫీజుబిలిటీ రిపోర్టును ఆమెకు అందిస్తారు. బనకచర్ల పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని మరోసారి కోరతారు.


ఈ పథకానికి ఆర్థిక సాయం కోసం ఇప్పటికే రెండుసార్లు నిర్మలను చంద్రబాబు కలిసి వినతిపత్రం అందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఇవ్వాలని ఆ సమయంలో సీఎంను ఆమె కోరారు. డీపీఆర్‌ తయారీకి సమయం పట్టే వీలున్నందున ప్రీ-ఫీజుబిలిటీ రిపోర్టును(పీఎ్‌సఆర్‌) సిద్థం చేయాలని జల వనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. బుధవారం ఆ రిపోర్టు సిద్థమవుతుందని జలవనరుల శాఖ తెలిపింది. కేంద్రమంత్రి నిర్మలతో భేటీకి ముందు, ఆ తర్వాత కూడా ఆయన పలువురు మంత్రులను కలుస్తారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలుస్తారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, కేంద్ర శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్‌తో భేటీ అవుతారు. సాయంత్రం 4గంటల నుంచి 5 వరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 03:06 AM