Chandrababu Naidu Delhi Visit: నేడు ఢిల్లీకి చంద్రబాబు
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:01 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లి, అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. మే 2న అమరావతిలో రూ.లక్ష కోట్ల విలువైన పనులను మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్న సీఎం
సాయంత్రం 4 గంటలకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారు
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారైంది. మే 2న అమరావతిలో సుమారు రూ.లక్ష కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన అమరావతి పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 25 , 2025 | 04:01 AM