ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: టెక్‌తో నేరగాళ్లకు చెక్‌

ABN, Publish Date - Jul 08 , 2025 | 03:56 AM

ఆధునిక సాంకేతికసాయంతో నేరగాళ్లకు చెక్‌ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రాన్ని నేరరహితంగా మార్చాలన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా ఉపయోగించాలని...

  • టెక్‌తో నేరగాళ్లకు చెక్‌

  • విస్తృతంగా సీసీ కెమెరాల వినియోగం

  • క్రైమ్‌ హాట్‌స్పాట్‌ల వద్ద అమర్చండి

  • ప్రైవేటు సీసీ కెమెరాలతోనూ పోలీసింగ్‌

  • అవసరమైతే నిబంధనలు మార్చండి

  • ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

  • రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు

  • క్వాంటమ్‌పై అధ్యయనానికి ఐటీ శాఖకు ఆదేశం

  • నేడు బెంగళూరుకు లోకేశ్‌.. ఐటీ ప్రతినిధులతో భేటీ

రాజకీయం ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవాలి. కొందరు తెలివిగా నేరాలు చేసి.. వాటిని ప్రభుత్వంపైకి నెడుతున్నారు.

- చంద్రబాబు

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతికసాయంతో నేరగాళ్లకు చెక్‌ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రాన్ని నేరరహితంగా మార్చాలన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా ఉపయోగించాలని... ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. సోమవారం అమరావతిలోని సచివాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సీసీ కెమెరాల సాయంతో నిరంతర నిఘా పెట్టి నేరాలను అదుపు చేయాలని చెప్పారు. దీనికోసం ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజీని కూడా తీసుకోవాలని... దీనికి అనుగుణంగా నిబంధనలు మార్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరస్థుల ఆచూకీ కోసం ప్రైవేటు వ్యక్తులు, సంస్థల సీసీటీవీ ఫుటేజీని పోలీసు విభాగం వినియోగించుకునేలా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సీసీ కెమెరాల నిరంతర నిఘాతో శాంతిభద్రతల పర్యవేక్షణ సులువవుతుందని పేర్కొన్నారు.

నిఘాతో భయం...

క్రైమ్‌ హాట్‌ స్పాట్లపై సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాలని సీఎం ఆదేశించారు. నిఘా పటిష్ఠంగా ఉందని తెలిస్తే నేరస్థులు భయపడతారని చెప్పారు. పోలీసు వ్యవస్థకు సహకరించని వ్యక్తులపట్ల మరింత కఠినంగా వ్యహరించాలని స్పష్టం చేశారు. షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, హోటళ్లలో ప్రజా భద్రత కోసం, నేరాల కట్టడికి, దర్యాప్తు నిమిత్తం, శాంతిభద్రతల పర్యవేక్షణకు పెద్దసంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పబ్లిక్‌ సేఫ్టీ యాక్టును వర్తింపజేయాలని అన్నారు. బహిరంగ కూడళ్లలో సీసీ కెమెరాలను పోలీసు విభాగం ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలన్నారు. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ పురోగతిపైనా ఆరా తీశారు. ప్రభుత్వ రికార్డులు, డేటా భద్రతకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ రికార్డులను కూడా ప్రక్షాళన చేసేందుకు నూతన సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటికీ సంబంధించిన సమాచారం కూడా టెక్నాలజీ సాయంతో భద్రపరిచే చర్యలు చేపట్టాలన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందిస్తున్న సేవలన్నీ ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో పిడుగులు పడే ప్రాంతాల్లో ప్రాణాలు కాపాడేలా ముందస్తు సమాచారం అందించాలని, అక్కడ సైరన్‌ మోగించాలని సూచించారు. రిజర్వాయర్లను పూర్తి సామర్థ్యంతో నింపాలని చెప్పారు. పీ4ను వినియోగించుకుంటూ 2029 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పనిచేయాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వ శాఖ తమ దగ్గరున్న లబ్ధిదారుల డేటా సహా ఇతర వివరాలను ఆర్టీజీఎ్‌సతో సమన్వయం చేసుకోవాలన్నారు.

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌పై సమగ్ర అధ్యయనం

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌పై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇప్పుడున్న ఈ తరహా కంప్యూటర్ల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వాటిని తయారు చేస్తున్న సంస్థలను పరిశీలించాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌పై ఆ శాఖ అధికారులతో సీఎం సమీక్షను నిర్వహించారు. గతనెల 30న జరిగిన క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వర్క్‌షాపులో చేసిన తీర్మానాలను అమలు చేయడంపైనా సమీక్షించారు. ఈ తీర్మానాల మేరకు జనవరి ఒకటిన అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీని ప్రారంభించడంపై బుధవారం జరిగే క్యాబినెట్‌ భేటీలో ప్రతిపాదనలు పెట్టి ఆమోదం పొందనున్నారు. కాగా, క్వాంటమ్‌పై అధ్యయనానికి.. మంగళవారం బెంగళూరులో సుమారు 12 ప్రఖ్యాత ఐటీ కంపెనీల ప్రతినిధులతోఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ భేటీ కానున్నారు.

14న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు 14 సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలవనరుల మంత్రి సీఆర్‌ పాటిల్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో సీఎం చర్చించే అవకాశం ఉంది.

Updated Date - Jul 08 , 2025 | 07:15 AM