Metro Projects Discussion: నేడు ఢిల్లీకి చంద్రబాబు
ABN, Publish Date - Jul 15 , 2025 | 03:43 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45కి ఢిల్లీకి చేరుకుంటారు.
అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45కి ఢిల్లీకి చేరుకుంటారు.మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు.అనంతరం 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్‌తో సమావేశమవుతారు.మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్‌తో భేటీ అవుతారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మధ్యాహ్నం 3.30కు మూర్తి మార్గ్-3లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం అవుతారు.16న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసి 17 ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు.
Updated Date - Jul 15 , 2025 | 03:45 AM