Amaravati: వందేళ్ల కోసం అమరావతికి ప్లానింగ్
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:47 AM
అమరావతి నిర్మాణాన్ని రాబోయే శతాబ్దాల దృష్టితో ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ, రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులను గౌరవించాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. 5 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో 11 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశామని చెప్పారు.
58 రోజుల్లోనే 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులు
2న ప్రధాని సభలో రైతులకు గౌరవం
మంత్రి నారాయణ వెల్లడి
ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన
విజయవాడ/తుళ్లూరు (వెలగపూడి), ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపట్టారని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో మే 2న జరగనున్న ప్రధాని సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ప్రధాని సభలో గౌరవించాలని సీఎం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అమరావతి రైతులు కేవలం 54 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉండాలనేది సీఎం సంకల్పం అని చెప్పారు. రాజధానికి అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతున్నామని, ప్రజలు అంగీకరిస్తేనే ల్యాండ్ ఫూలింగ్ చేస్తామన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీలు వస్తేనే రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందుతాయన్నారు.
11 చోట్ల పార్కింగ్
ప్రధాని పర్యటన ఏర్పాట్లు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. సభ కోసం 11 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశామన్నారు. 5 లక్షలు మంది వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని సభలో చల్లదనం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 25 , 2025 | 04:47 AM