ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Fund Approval: కొత్తచెరువు స్టేడియానికి 2కోట్లు

ABN, Publish Date - Jul 11 , 2025 | 03:43 AM

ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరం అండగా.. కార్యక్రమం ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి దారిచూపింది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని సత్యసాయి జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో 2014లో..

  • మెగా పీటీఎంలో కేటాయించిన సీఎం చంద్రబాబు

  • ‘అక్షరం అండగా...’తో సమస్యకు పరిష్కారం

కొత్తచెరువు, జూలై 10(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా..’ కార్యక్రమం ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి దారిచూపింది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని సత్యసాయి జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో 2014లో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు అటకెక్కాయి. ఈ ఏడాది జనవరి 27న ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమాన్ని కొత్తచెరువులో నిర్వహించింది. ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డిని స్థానికులు కోరారు. ఈ విషయాన్ని మెగా పీటీఎం 2.0లో పాల్గొనడానికి కొత్తచెరువుకు వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టికి ఆమె తీసుకెళ్లారు. దీంతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి సీఎం తక్షణం రూ.2 కోట్లు మంజూరు చేశారు.

Updated Date - Jul 11 , 2025 | 03:47 AM