రెండో రోజూ రగిలిన మహిళలు
ABN, Publish Date - Jun 11 , 2025 | 01:02 AM
అమరావతి మహిళల పట్ల సాక్షి టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రగిలిపోయిన తిరుపతి జిల్లా మహిళలు వరుసగా రెండో రోజూ నిరసన, ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. తిరుపతి జీవకోనలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఆ సందర్భంగా ఓ మహిళ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా మిగిలిన మహిళలు అడ్డుకున్నారు. నిరసన కారులు అక్కడ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కాగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ ఆధ్వర్యంలో పలువురు మహిళలు రామచంద్ర పుష్కరిణి నుంచీ టౌన్ క్లబ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఫ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాలో ఆందోళన
తిరుపతి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళల పట్ల సాక్షి టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రగిలిపోయిన తిరుపతి జిల్లా మహిళలు వరుసగా రెండో రోజూ నిరసన, ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. తిరుపతి జీవకోనలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఆ సందర్భంగా ఓ మహిళ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా మిగిలిన మహిళలు అడ్డుకున్నారు. నిరసన కారులు అక్కడ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కాగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ ఆధ్వర్యంలో పలువురు మహిళలు రామచంద్ర పుష్కరిణి నుంచీ టౌన్ క్లబ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. వెంకటగిరిలో మహిళలు ఎంపీడీవో కార్యాలయం నుంచీ పోలేరమ్మ ఆలయం ఆర్చి వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ సందర్భంగా సాక్షి పత్రిక ప్రతులను తగులబెట్టడంతో పాటు సాక్షి డిబేట్‌లో పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు ఫొటోలను చెప్పులతో కొట్టారు. అనంతరం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరులో తెలుగు మహిళలు వివేకానంద రోడ్డు నుంచీ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా టవర్ క్లాక్ కూడలి వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి యాజమాన్యానికి, డిబేట్‌లో మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సాక్షి పత్రికలను, జగన్ ఫ్లెక్సీని దహనం చేశారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి, తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి శ్రావణి, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి నీలావతి తదితరులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో పాండురంగ వీధి నుంచీ ఆర్టీసీ బస్టాండు దాకా నిరసన ర్యాలీ చేపట్టిన తెలుగు మహిళలు అనంతరం బస్టాండు వద్ద మానవ హారంగా ఏర్పడ్డారు. సాక్షి యాజమాన్యంపైకేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, పలువురు తెలుగుమహిళలు పాల్గొన్నారు. సత్యవేడులో టీడీపీ పరిశీలకుడు చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో మహిళలు శ్రీకాళహస్తి బస్టాండు నుంచీ ఆర్టీసీ పెద్ద బస్టాండు వరకూ నిరసన ర్యాలీ నిర్వహించి సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Updated Date - Jun 11 , 2025 | 01:02 AM