ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లక్షల్లో జీతాలు తీసుకొంటున్నారు పేదలకు సరైన వైద్యం అందించలేరా?

ABN, Publish Date - Apr 25 , 2025 | 01:56 AM

‘రూ.లక్షల్లో జీతాలు తీసుకొంటున్నారు. పేదలకు సరైన వైద్యం అందించ లేరా? మీ పనితీరు సరిగా లేదు. పద్ధతి మార్చుకోండి’ అం టూ కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ దొరవారిసత్రం పీహెచ్‌సీ వైద్యులను హెచ్చరించారు. గురువారం ఆయ న ఆస్పత్రిని తనిఖీ చేశారు. ల్యాబొరేటరీలోని పరికరాలను పరిశీలించారు. వీటిని చూసుకొంటుంటారా.. ఉపయోగించరా అంటూ ప్రశ్నించారు. ఫార్మశిలోని మందులను చూశారు. కాన్పుల గదిలోకి వెళ్లిన ఆయన ఇంత మంచి వసతి పెట్టుకొని కాన్పులు ఎందుకు చేయడం లేదని వైద్యురాలు చంద్రికను ప్రశ్నించారు. పుట్టిన బిడ్డను ఉంచే వార్మర్‌ పరికరాన్ని చూసిన కలెక్టర్‌.. దీనిని వాడే విధానం మీకు తెలుసా అంటూ డాక్టర్లు చంద్రిక, చైతన్యను అడిగారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో బేబి పుట్టిన వెంటనే ఉంచే వార్మర్‌ గురించీ తెలియక పోతే మీరేం వైద్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంచి కళాశాలల్లో చదివి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత వృత్తిని మరిచిపోయారా అంటూ మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రతి రోగికి మంచి వైద్యం అందేలా మీలో మార్పులు రావాలని కోరారు. ఈ ఆస్పత్రిని తరచూ తనిఖీ చేయాలని సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయికి సూచించారు. జిల్లా వైద్యాధికారులతోనూ మాట్లాడి సరిచేయాలన్నారు.

పీహెచ్‌సీ వైద్యులను ప్రశ్నించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

- పీహెచ్‌సీ వైద్యులను ప్రశ్నించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

దొరవారిసత్రం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘రూ.లక్షల్లో జీతాలు తీసుకొంటున్నారు. పేదలకు సరైన వైద్యం అందించ లేరా? మీ పనితీరు సరిగా లేదు. పద్ధతి మార్చుకోండి’ అం టూ కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ దొరవారిసత్రం పీహెచ్‌సీ వైద్యులను హెచ్చరించారు. గురువారం ఆయ న ఆస్పత్రిని తనిఖీ చేశారు. ల్యాబొరేటరీలోని పరికరాలను పరిశీలించారు. వీటిని చూసుకొంటుంటారా.. ఉపయోగించరా అంటూ ప్రశ్నించారు. ఫార్మశిలోని మందులను చూశారు. కాన్పుల గదిలోకి వెళ్లిన ఆయన ఇంత మంచి వసతి పెట్టుకొని కాన్పులు ఎందుకు చేయడం లేదని వైద్యురాలు చంద్రికను ప్రశ్నించారు. పుట్టిన బిడ్డను ఉంచే వార్మర్‌ పరికరాన్ని చూసిన కలెక్టర్‌.. దీనిని వాడే విధానం మీకు తెలుసా అంటూ డాక్టర్లు చంద్రిక, చైతన్యను అడిగారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో బేబి పుట్టిన వెంటనే ఉంచే వార్మర్‌ గురించీ తెలియక పోతే మీరేం వైద్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంచి కళాశాలల్లో చదివి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత వృత్తిని మరిచిపోయారా అంటూ మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రతి రోగికి మంచి వైద్యం అందేలా మీలో మార్పులు రావాలని కోరారు. ఈ ఆస్పత్రిని తరచూ తనిఖీ చేయాలని సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయికి సూచించారు. జిల్లా వైద్యాధికారులతోనూ మాట్లాడి సరిచేయాలన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 01:56 AM