ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ పిల్లలకు దిక్కెవరు?

ABN, Publish Date - May 20 , 2025 | 02:32 AM

తమ బాగోగులు చూసుకునే అమ్మ చనిపోయిందని వాళ్లకు తెలియదు. ఆ అమ్మను క్షణికావేశంలో చంపింది తమ నాన్నే అనీ తెలియదు. అతడు చట్టానికి దొరక్కుండా పోరిపోయాడనీ తెలియదు. ఇలా అభం శుభం తెలియని ఆ ముగ్గురు చిన్నారులు.. ఎప్పటికీ రాని.. అమ్మకోసం ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు. ఇలా ముగ్గురు చిన్నారులను దిక్కులేనివారిగా మార్చిన ఘటన నేపథ్యాన్ని చూస్తే.. చిట్టమూరుకు చెందిన వీణమ్మను ఆరేళ్ల కిందట శ్రీనివాసులు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు నాయుడుపేట మండలం మడఫలం వద్ద పూరిగుడిసెలో నివసిస్తూ, కూలి పనులు చేసుకుంటున్నారు. వీరికి అఖిల, బత్తెయ్య, ఆదెయ్య పిల్లలు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్యాభర్తలు కల్లు తాగి ఇంటికి వెళ్తుండగా చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పెద్దదికావడంతో రాయితో భార్య వీణమ్మ ముఖంపై శ్రీనివాసులు బలంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఎస్‌ఐ ఆదిలక్ష్మి సంఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. సందర్భంగా ఆ ముగ్గురు చిన్నారులు వైద్యశాల ప్రాంగణంలో కూర్చుని అమ్మకావాలంటూ ఏడుస్తున్న సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి చనిపోవడం.. తండ్రి పరారీలో ఉండటంతో అనాథలుగా మారిన ఆ ముగ్గురు చిన్నారులను అమ్మమ్మ ఆదెమ్మ తన వెంట తీసుకెళ్లింది. మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పోస్టుమార్టం అనంతరం నాయుడుపేట మున్సిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.

ఆస్పత్రి ప్రాంగణం చిన్నారులకు అన్నం తినిపిస్తున్న అమ్మమ్మ ఆదెమ్మ

మా అమ్మ ఆ గదిలో నిద్రపోతోంది

..అంటూ మార్చురీ వైపు చేయి చూపిస్తున్నారు.

అమ్మ కావాలి

.. ఎంతసేపటికీ అమ్మ కనిపించకపోవడంతో ఏడుపు

నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో సోమవారంనాటి ఈ దృశ్యాలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి.

నాయుడుపేట టౌన్‌, ఆంధ్రజ్యోతి : తమ బాగోగులు చూసుకునే అమ్మ చనిపోయిందని వాళ్లకు తెలియదు. ఆ అమ్మను క్షణికావేశంలో చంపింది తమ నాన్నే అనీ తెలియదు. అతడు చట్టానికి దొరక్కుండా పోరిపోయాడనీ తెలియదు. ఇలా అభం శుభం తెలియని ఆ ముగ్గురు చిన్నారులు.. ఎప్పటికీ రాని.. అమ్మకోసం ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు. ఇలా ముగ్గురు చిన్నారులను దిక్కులేనివారిగా మార్చిన ఘటన నేపథ్యాన్ని చూస్తే.. చిట్టమూరుకు చెందిన వీణమ్మను ఆరేళ్ల కిందట శ్రీనివాసులు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు నాయుడుపేట మండలం మడఫలం వద్ద పూరిగుడిసెలో నివసిస్తూ, కూలి పనులు చేసుకుంటున్నారు. వీరికి అఖిల, బత్తెయ్య, ఆదెయ్య పిల్లలు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్యాభర్తలు కల్లు తాగి ఇంటికి వెళ్తుండగా చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పెద్దదికావడంతో రాయితో భార్య వీణమ్మ ముఖంపై శ్రీనివాసులు బలంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఎస్‌ఐ ఆదిలక్ష్మి సంఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. సందర్భంగా ఆ ముగ్గురు చిన్నారులు వైద్యశాల ప్రాంగణంలో కూర్చుని అమ్మకావాలంటూ ఏడుస్తున్న సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి చనిపోవడం.. తండ్రి పరారీలో ఉండటంతో అనాథలుగా మారిన ఆ ముగ్గురు చిన్నారులను అమ్మమ్మ ఆదెమ్మ తన వెంట తీసుకెళ్లింది. మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పోస్టుమార్టం అనంతరం నాయుడుపేట మున్సిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - May 20 , 2025 | 02:32 AM