ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ మాటలేంటి జగన్‌?

ABN, Publish Date - Apr 10 , 2025 | 02:27 AM

పోలీసులను బట్టలూడదీసి కొడతానని వైసీపీ అధినేత జగన్‌ బెదిరించడం చూస్తే అతనిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులను భయపెట్టేలా మాటలేంటంటూ మండిపడ్డారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆయన.. ఇప్పుడు అదే పోలీసులు రక్షణగా వస్తే వారిని అవమానపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జగన్‌ బయటకు వచ్చేఆరు కాదన్నారు. వైసీపీ హయాంలో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా తమను హౌస్‌ అరెస్టులు చేసేవారని గుర్తుచేశారు. ఇప్పుడలా చేయడం లేదన్నారు.

- ఇకనైనా శవరాజకీయాలు మానుకో అన్న మంత్రి కొల్లు

తిరుపతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పోలీసులను బట్టలూడదీసి కొడతానని వైసీపీ అధినేత జగన్‌ బెదిరించడం చూస్తే అతనిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులను భయపెట్టేలా మాటలేంటంటూ మండిపడ్డారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆయన.. ఇప్పుడు అదే పోలీసులు రక్షణగా వస్తే వారిని అవమానపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జగన్‌ బయటకు వచ్చేఆరు కాదన్నారు. వైసీపీ హయాంలో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా తమను హౌస్‌ అరెస్టులు చేసేవారని గుర్తుచేశారు. ఇప్పుడలా చేయడం లేదన్నారు. వైసీపీలో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ జరుగుతోందని, అందుకే ఆలస్యం కావచ్చేమోగానీ ఎవరూ తప్పించుకోలేరన్నారు. కేసుల్లో ఉన్నవారు ముందుగానే బెయిల్‌కోసం ప్రయత్నిస్తున్నారంటే వారి ప్రమేయం ఉంటుందన్న అనుమానం కలుగుతోందన్నారు. అనంతపురం జిల్లాలో ఒక కుటంబ తగాదాల్లో చనిపోయిన వ్యక్తిని శవ రాజకీయం చేశారని విమర్శించారు. ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ఢిల్లీకి వెళ్లి ఏపీలో శాంతిభద్రతలు లేవని నానా యాగీ చేసిన జగన్‌.. ఇప్పుడు శవరాజకీయాలు ఎత్తుకున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఏపీ రెండోస్థానంలో నిలవడం చంద్రబాబు పనితీరుకు నిదర్శనమన్నారు. వైసీసీ పాలనలో జీడీపీ పూర్తిగా పడిపోతే దానిని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు నరసింహ యాదవ్‌, సుగుణమ్మ, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, రుద్రకోటి సదాశివం, మహేష్‌ యాదవ్‌, మన్నెం శ్రీనివాసులు, కృష్ణ యాదవ్‌, శంకర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 02:27 AM