ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్టీ ప్రతిష్టను దిగజార్చితే సహించేది లేదు

ABN, Publish Date - Jul 27 , 2025 | 01:41 AM

పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేదిలేదని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ పార్టీ శ్రేణులను హెచ్చరించారు.

మీడియా సమావేశంలో టీడీపీ నేతలతో సీఆర్‌ రాజన్‌

చిత్తూరు సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేదిలేదని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ పీఏ చంద్రశేఖర్‌ తీరుపైౖ నియోజకవర్గంలోని కొందరు నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదుచేయడంపై ఆయన స్పందించారు. శనివారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేతల మధ్య ఏవైనా సమస్యలు, మనస్పర్థలుంటే పార్టీ పెద్దల సమక్షంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. అలాకాకుండా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని అధికారులకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. ఈ విషయంలో నేతలు సంయమనం పాటించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే పీఏ ఏవైనా తప్పులు చేసినట్లు ఆధారాలుంటే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగిందని నియోజకవర్గంలోని నేతలందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళతామని ఆయన చెప్పారని తెలిపారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, నాగేశ్వరరావు, రుద్రప్ప, ఇందిరమ్మ, జయశంకర్‌ నాయుడు, చెంగల్రాయ యాదవ్‌, శ్రీధర్‌ యాదవ్‌, లోకనాథ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 01:41 AM