టెక్నాలజీ వినియోగంలో మనమే టాప్
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:14 AM
టెక్నాలజీ వాడకంలో ప్రపంచంలోనే మన దేశం ముందుందుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
పోలీసు శాఖలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం అభినందనీయం
కేంద్ర మంత్రి బండి సంజయ్
తిరుపతి(నేరవిభాగం), జూన్ 11(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ వాడకంలో ప్రపంచంలోనే మన దేశం ముందుందుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తిరుపతిలో బుధవారం వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఎస్పీ హర్షవర్ధన రాజు విజ్ఞప్తి మేరకు సాయంత్రం జిల్లా పోలీసు రిజర్వు గ్రౌండుకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలన్న లక్ష్యంతో ఈ మొక్క నాటానని తెలిపారు. అంతకుముందు డ్రోన్ల వినియోగం, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. డ్రోన్లు పైకి ఎగురవేసి వాటి ద్వారా నేరస్థులు, గంజాయి వినియోగదారులు, రౌడీల ఆటకట్టించడం వంటి చర్యలకు ఎలా ఉపయోగపడుతున్నాయో మంత్రికి ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, నేతలు కోలా ఆనంద్, వరప్రసాద్, మునిసుబ్రమ్మణ్యం, అదనపు ఎస్పీలు నాగభూషణం(క్రైం,), రవిమనోహరాచ్చారి, శ్రీనివాసరావు, డీఎస్పీలు భకత్తవత్సలం, రామకృష్ణమాచ్చారి, శ్యాం సుందర్, సైబర్ క్రైం సీఐ వినోద్‌కుమార్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 01:14 AM