నిరసన గళం
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:57 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై దాడి చేసిన ఆ పార్టీ అల్లరి మూకలను అరెస్టు చేయాలటూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు నినదించాయి.
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడిన వైసీపీ మూకలను అరెస్టు చేయాలంటూ ధర్నాలు
జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళనలు
చిత్తూరు అర్బన్, జూలై 10(ఆంధ్రజ్యోతి):వైసీపీ అధ్యక్షుడు జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై దాడి చేసిన ఆ పార్టీ అల్లరి మూకలను అరెస్టు చేయాలటూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు నినదించాయి. కొన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించగా...మరికొన్ని చోట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు.దాడి కేసులో నిందితులను అరెస్టు చేయాలంటూ అఽధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ఽధరించి వైసీపీకి వ్యతిరేకండా నినాదాలు చేశారు.పత్రికా స్వేచ్ఛ అంటే అర్థం తెలియకుండా ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసిన వైసీపీ శ్రేణులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం దాడుల నివారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఏవో మురళీ మోహన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాధన్, కార్యదర్శి మురళీకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అశోక్‌కుమార్,జయప్రకాష్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమేష్, సెక్రటరీ కాళేశ్వరరెడ్డి, సంయుక్త కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.పలమనేరు ఆర్డీవో కార్యాలయం వద్ద వివిధ జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.ఫొటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అనంతరం ఆర్డీవో భవానీకి వినతిపత్రాన్ని అందజేశాయి.కుప్పంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన జర్నలిస్టు సంఘ నేతలు ప్రదర్శనగా కడా ఆఫీస్ మీదుగా డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని డీఎస్పీ పార్థసారధికి వినతిపత్రాన్ని అందజేశారు. పూతలపట్టు అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఏపీయూడబ్ల్యూజే జీడీ నెల్లూరు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పుంగనూరులో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎన్టీయార్ సర్కిల్ వద్ద ధర్నా చేశారు.తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రాముకు వినతిపత్రాన్ని అందజేశారు.
Updated Date - Jul 11 , 2025 | 01:57 AM