ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీఆర్‌కు ఇద్దరు ఎస్‌ఐలు

ABN, Publish Date - Jun 12 , 2025 | 01:07 AM

ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపుతూ బుధవారం ఎస్పీ హర్షవర్ధనరాజు ఆదేశాలిచ్చారు. జిల్లాలో కొందరు ఎస్‌ఐల పనితీరు, వ్యవహారశైలిపై ఇంటెలిజెన్సు, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు.

ముగ్గురికి పోస్టింగ్‌ ఇస్తూ ఎస్పీ ఆదేశాలు

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపుతూ బుధవారం ఎస్పీ హర్షవర్ధనరాజు ఆదేశాలిచ్చారు. జిల్లాలో కొందరు ఎస్‌ఐల పనితీరు, వ్యవహారశైలిపై ఇంటెలిజెన్సు, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. దీంతో వెంకటగిరి ఎస్‌ఐ జి.సుబ్బారావు, పాకాల ఎస్‌ఐ ఎంఎన్‌ సింజీవరాయుడును వీఆర్‌కు సాగనంపారు. ఇక, తిరుపతి ఈస్ట్‌లో పనిచేసి వీఆర్‌కు వెళ్లిన ఎస్‌ఐ బాలకృష్ణను ఎర్రావారిపాలేనికి.. తిరుపతి ఈస్ట్‌లోని రామాంజనేయులును తొట్టంబేడుకు, వీఆర్‌లోని మస్తానయ్యను వెంకటగిరికి బదిలీ చేశారు. వీరందరూ తక్షణం వారి స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మరికొందరు సీఐలు, ఎస్‌ఐల పనితీరుపై నిఘా ఉంచినట్లు తెలిసింది.

Updated Date - Jun 12 , 2025 | 01:07 AM