రెవెన్యూశాఖలో బదిలీలు
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:03 AM
ఉమ్మడి చిత్తూరుజిల్లాకు సంబంధించి రెవెన్యూశాఖలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ నోడల్ అధికారి అయిన కలెక్టర్ సుమిత్‌కుమార్ నేతృత్వంలో జరిగింది.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరుజిల్లాకు సంబంధించి రెవెన్యూశాఖలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ నోడల్ అధికారి అయిన కలెక్టర్ సుమిత్‌కుమార్ నేతృత్వంలో జరిగింది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించిన అనంతరం బదిలీల ప్రక్రియ చేపట్టారు. చిత్తూరు అర్బన్ తహసీల్దార్ చంద్రశేఖర రెడ్డిని తిరుపతి జిల్లాకు, తిరుపతి జిల్లా డీఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న రేఖను చిత్తూరుజిల్లాకు బదిలీ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 24 మంది డిప్యూటీ తహసీల్దార్లకు అడహక్ పద్ధతిలో తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లాలను కేటాయించారు.
ఫ అన్నమయ్య జిల్లాకు కేటాయించిన డీటీలు :బావాజాన్ (సంబేపల్లి), హరికుమార్ (తంబళ్ళపల్లె), రామాంజనేయులు (రామాపురం), ప్రదీప్ (ములకలచెరువు), వెంకటేశులు (ములకలచెరువు), క్రాంతికుమార్ (కేవీపల్లి), తపస్విని (కురబలకోట), మహమ్మద్ అజారుద్దీన్ (డీఎస్వో కార్యాలయం), నారు పమిలేటి (వాల్మీకిపురం).
ఫ తిరుపతి జిల్లాకు కేటాయించిన డీటీలు:శాంతి (ఆర్డీవో కార్యాలయం, శ్రీకాళహస్తి), తనూజ (డీఎస్వో కార్యాలయం, తిరుపతి).
ఫ చిత్తూరు జిల్లాకు కేటాయించిన డీటీలు:రాజేంద్ర (తిరుపతి), పార్థసారథి (యాదమరి), రమే్‌షబాబు (పూతలపట్టు), కిరణ్ (విజయపురం), జయసింహ (పులిచెర్ల), శ్రీనివాసులు (తిరుపతి), శ్రావణ్‌కుమార్ (పెనుమూరు), రాధిక (తిరుపతి), నాగరాజు (కార్వేటినగరం), కౌలేష్ (విజయపురం), మాధవి (చౌడేపల్లి), కళ్యాణి (బంగారుపాళ్యం). వీరందరికీ ఆయా మండలాల్లో పోస్టింగులు ఇవ్వనున్నారు.
Updated Date - Jun 12 , 2025 | 01:03 AM