వెల్ఫేర్ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్
ABN, Publish Date - Jun 29 , 2025 | 01:19 AM
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లకు శనివారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు.
చిత్తూరు అర్బన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లకు శనివారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. చిత్తూరు అంబేడ్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమశాఖ డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో ఐదేళ్లు పూర్తయిన వారికి కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. మొదట విభిన్న ప్రతిభావంతులకు, స్పౌజ్ కేటగిరీ వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అభ్యర్థుల నుంచి ముందుగా తీసుకున్న ఆప్షన్లు, ఖాళీల ఆధారంగా సీనియారిటీ ప్రకారం కోరుకునే అవకాశాన్ని కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 485 పోస్టులకు 355 మందికి బదిలీల కౌన్సెలింగ్‌ను నిర్వహించినట్లు డీడీ తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సూపరింటెండెంట్లు మురుగేశ్, మురళి, సూర్యప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీదేవి, సిబ్బంది పవన్, ధనశేఖర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు ఏఎ్‌సడబ్ల్యూవోను సరెండర్ చేస్తాం: డీడీ
అంబేడ్కర్ భవన్‌లో జరిగిన బదిలీ కౌన్సెలింగ్ వచ్చిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిత్తూరు ఏఎ్‌సడబ్ల్యూవోను ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని డీడీ తెలిపారు. అవసరమైన కుర్చీలు, తాగునీరు, మైక్ వసతి ఏర్పాటు చేయకపోవడంతో ఏఎ్‌సడబ్ల్యూవో, చిత్తూరు యూనిట్ వార్డెన్లపై ఆయన మండిపడ్డారు. కాగా, కౌన్సెలింగ్ ప్రారంభమైన రెండు గంటలకు వెల్ఫేర్ అసిస్టెంట్లకు కుర్చీలను ఏర్పాటు చేశారు.
Updated Date - Jun 29 , 2025 | 01:19 AM