ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ-సిమ్‌ పేరుతో టోకరా

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:36 AM

తడ మండల పరిధిలోని పెరియవట్టు గ్రామానికి చెందిన ఈదూరు శ్రీదేవికి స్థానిక కెనరా బ్యాంక్‌లో ఖాతా ఉంది. పది నెలల క్రితం పొదుపు సంఘం ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు చేద్దామన్న ఉద్దేశంతో ఆ డబ్బును ఖాతాలోనే ఉంచింది. బ్యాంక్‌ ఖాతాకు ఆమె కుమారుడు లోకనాథం ఫోన్‌ నెంబరును జత చేసింది. ఇదిలా ఉండగా గత శనివారం లోకనాథం ఫోన్‌కు ఈ-సిమ్‌ కావాలంటే తమను సంప్రదించాలంటూ ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఈ లింక్‌ వచ్చింది. లోకనాథం ఆ లింక్‌ను క్లిక్‌ చేయడంతో కొద్ది నిమిషాల తరువాత ఫోన్‌ హ్యాంగ్‌ అయింది. వెంటనే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ సెండ్‌ చేస్తే మీ ఫోన్‌ సాధారణ స్థితికి వస్తుందంటూ మరో మెసేజ్‌ రావడంతో లోకనాథం ఆ ఓటీపీని అలాగే ఫార్వాడ్‌ చేశాడు. అప్పటి నుంచి ఆదివారం వరకు అతని ఫోన్‌ పనిచేయలేదు. సోమవారం బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.25వేలు నగదు డ్రా చేసినట్లుగా మెసేజ్‌ రావడంతో లోకనాథం ఖంగుతిన్నాడు. వెంటనే తల్లిని తీసుకొని బ్యాంక్‌కు వెళ్లి విచారించగా తన ఖాతాలో ఉండాల్సిన రూ.1.90 లక్షలు మరో అకౌంట్‌లోకి వెళ్లిపోయినట్లు బ్యాంక్‌ అధికారులు చెప్పారు. దీంతో లబోదిబోమంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ రూ.1.90 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

తడ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళ ఖాతాలో నుంచి రూ.1.90 లక్షలు కాజేశారు. తడ మండల పరిధిలోని పెరియవట్టు గ్రామానికి చెందిన ఈదూరు శ్రీదేవికి స్థానిక కెనరా బ్యాంక్‌లో ఖాతా ఉంది. పది నెలల క్రితం పొదుపు సంఘం ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు చేద్దామన్న ఉద్దేశంతో ఆ డబ్బును ఖాతాలోనే ఉంచింది. బ్యాంక్‌ ఖాతాకు ఆమె కుమారుడు లోకనాథం ఫోన్‌ నెంబరును జత చేసింది. ఇదిలా ఉండగా గత శనివారం లోకనాథం ఫోన్‌కు ఈ-సిమ్‌ కావాలంటే తమను సంప్రదించాలంటూ ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఈ లింక్‌ వచ్చింది. లోకనాథం ఆ లింక్‌ను క్లిక్‌ చేయడంతో కొద్ది నిమిషాల తరువాత ఫోన్‌ హ్యాంగ్‌ అయింది. వెంటనే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ సెండ్‌ చేస్తే మీ ఫోన్‌ సాధారణ స్థితికి వస్తుందంటూ మరో మెసేజ్‌ రావడంతో లోకనాథం ఆ ఓటీపీని అలాగే ఫార్వాడ్‌ చేశాడు. అప్పటి నుంచి ఆదివారం వరకు అతని ఫోన్‌ పనిచేయలేదు. సోమవారం బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.25వేలు నగదు డ్రా చేసినట్లుగా మెసేజ్‌ రావడంతో లోకనాథం ఖంగుతిన్నాడు. వెంటనే తల్లిని తీసుకొని బ్యాంక్‌కు వెళ్లి విచారించగా తన ఖాతాలో ఉండాల్సిన రూ.1.90 లక్షలు మరో అకౌంట్‌లోకి వెళ్లిపోయినట్లు బ్యాంక్‌ అధికారులు చెప్పారు. దీంతో లబోదిబోమంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jul 01 , 2025 | 01:36 AM