ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు ఆచార్య ఆత్రేయ జయంతి! మనసుకవి పుట్టింది ఇక్కడే!

ABN, Publish Date - May 07 , 2025 | 01:14 AM

ఆచార్య ఆత్రేయ పుట్టిన ఇల్లు ఇది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఇప్పటికీ ఈ పాత మిద్దె ఆయన పాటవలే చెక్కుచెదరకుండా ఉంది. 1915లో ఈ ఇల్లు నిర్మించారు. ప్రస్తుతం ఆయన కుటుంబానికి చెందినవారు ఎవరూ ఈ గ్రామంలో లేరు. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. 1921, మే 7న తన అమ్మమ్మగారి ఊరైన మంగళంపాడులో పుట్టారు. ఆత్రేయ తండ్రి వెంకట కృష్ణామాచార్యులు స్వగ్రామం ఉచ్చూరు. తల్లి సీతమ్మది మంగళంపాడు. తండ్రి ఉచ్చూరు జమీన్‌గా కూడా వ్యవహరించారు. తల్లి సీతమ్మ కాన్పుకోసం మంగళంపాడుకు వచ్చింది. ఆత్రేయ అక్కడే పుట్టడంతో నా జన్మస్థలం మంగళంపాడుని అందరితో చెప్పేవారు. తన 8వ ఏటనే తల్లి మరణించడంతో మంగళంపాడులో మేనమామ వద్ద పెరిగాడు. చిన్నప్పటి నుంచీ నాటకాలమీద మోజు ఎక్కువ. ఉచ్చూరులో వీధినాటకాలు వేసేవాడు. నాటకాల నేపథ్యం నుంచే 1951లో దీక్ష సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 1400కి పైగా సినిమా పాటలు రాశారు. 400 సినిమాలకు మాటలు రాశారు. నిర్మాతగా మారారు. దర్శకత్వం వహించారు.

కుటుంబ సభ్యులతో ఆత్రేయ

సూళ్లూరుపేట, మే 6 (ఆంధ్రజ్యోతి):

ఆచార్య ఆత్రేయ పుట్టిన ఇల్లు ఇది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఇప్పటికీ ఈ పాత మిద్దె ఆయన పాటవలే చెక్కుచెదరకుండా ఉంది. 1915లో ఈ ఇల్లు నిర్మించారు. ప్రస్తుతం ఆయన కుటుంబానికి చెందినవారు ఎవరూ ఈ గ్రామంలో లేరు. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. 1921, మే 7న తన అమ్మమ్మగారి ఊరైన మంగళంపాడులో పుట్టారు. ఆత్రేయ తండ్రి వెంకట కృష్ణామాచార్యులు స్వగ్రామం ఉచ్చూరు. తల్లి సీతమ్మది మంగళంపాడు. తండ్రి ఉచ్చూరు జమీన్‌గా కూడా వ్యవహరించారు. తల్లి సీతమ్మ కాన్పుకోసం మంగళంపాడుకు వచ్చింది. ఆత్రేయ అక్కడే పుట్టడంతో నా జన్మస్థలం మంగళంపాడుని అందరితో చెప్పేవారు. తన 8వ ఏటనే తల్లి మరణించడంతో మంగళంపాడులో మేనమామ వద్ద పెరిగాడు. చిన్నప్పటి నుంచీ నాటకాలమీద మోజు ఎక్కువ. ఉచ్చూరులో వీధినాటకాలు వేసేవాడు. నాటకాల నేపథ్యం నుంచే 1951లో దీక్ష సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 1400కి పైగా సినిమా పాటలు రాశారు. 400 సినిమాలకు మాటలు రాశారు. నిర్మాతగా మారారు. దర్శకత్వం వహించారు. 1961లో అక్కినేటి నాగేశ్వరావు నటించిన వాగ్దానం సినిమాకు ఆత్రేయ దర్శకత్వం వహించారు. అన్నమయ్య సినిమా తీయాలని ఆయన కోరిక. ఇందుకోసం తిరుపతిలో పలు పలు ప్రాంతాలను కూడా సందర్శించారు. ఆ కోరిక నెరవేరకుండానే 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మృతి చెందారు. చివరి రోజుల్లో మంగళంపాడులోనే స్థిరపడుతానని చెప్పేవారు. ఆయన స్మారకంగా ఆ గ్రామంలోని గిరిజన కాలనీకి ఆత్రేయ కాలనీ అని పేరు పెట్టారు. సూళ్లూరుపేటలోనూ ఆత్రేయ పేరుతో ఒక వీధి ఉంది.

సినీరంగ ప్రవేశం తర్వాతనే కిళాంబి వెంకట నరసింహాచార్యులు ఆత్రేయగా మారారు. పేరుచివరిలోని ఆచార్యనీ, తన గోత్రం అయిన ఆత్రేయనూ కలిపి ఆచార్య ఆత్రేయ అని తనే పేరు పెట్టుకున్నారాయన. ఆత్రేయకు జనం పెట్టిన పేరు మాత్రం మనసు కవి. ఆత్రేయను గొప్ప వేదాంతిగా పేర్కొంటారు. మనసు సంబంధమైన పాటలే ఎక్కువగా రాయడంతో మనసుకవిగా ప్రసిద్ధుడయ్యారు. ఆత్రేయ గొప్ప నాటకాలు రాశారు. సినిమాకన్నా నాటకం మీద ఆయనకు మక్కువ ఎక్కువ అని స్నేహితులు చెబుతారు. ఆత్రేయ స్మారకంగా సూళ్లూరుపేట పట్టణంలో ఆడిటోరియం నిర్మించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నాయకులు పూనుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు.

Updated Date - May 07 , 2025 | 01:14 AM