Tirumala: భక్తులను బురిడీ కొట్టించిన దళారులు..
ABN, Publish Date - Feb 21 , 2025 | 02:05 PM
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకెన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని..రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు కొనుగోలు చేశామని చెబుతూ దళారులు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టించారు.
తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan) కల్పిస్తామని.. రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు (Tickets) కొనుగోలు చేశామని చెబుతూ దళారులు శ్రీవారి భక్తులను (Devotees) బురిడీ (fraud ) కొట్టించారు. బ్రేక్ దర్శనం టికెట్లను ముందుగానే కొనుగోలు చేసినట్లు.. పుణెకు చెందిన భక్తుడు ప్రకాశ్, విష్ణువర్ధన్‌ను చంద్రలేఖ గోపాల్ అనే దళారి మోసం చేశాడు. బ్రేక్ దర్శన టిక్కెట్ల కోసం ప్రకాష్ వద్ద నుంచి రూ. 70 వేలు తీసుకున్నాడు. వారిని ఎమ్మెల్యే సిఫార్సుపై రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దళారులు పంపారు. అయితే శ్రీవాణి టికెట్ల పేరుతో తమను మోసం చేశారని భక్తుడు ప్రకాష్ టీటీడీ విజిలెన్స్‌ను ఆశ్రయించాడు. విజిలేన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డైక్ టూర్స్ కార్పొరేషన్‌కు చెందిన చంద్రలేఖ గోపాల్, ట్రావెల్ ఏజెంట్ శరవణన్, శరత్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్త కూడాచదవండి..
నా ఇల్లు కూల్చకండి బాధితుడి ఆవేదన
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకెన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మందిని బురిడీ కొట్టించాడు. హైదరాబాద్‌కు ఈ 14 మంది భక్తుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.800 చొప్పున వసూలు చేశాడు. వీరంతా శ్రీవారికి సేవ చేయాలని భావించి టికెట్లు బుక్ చేసుకునేందుకు యత్నించారు. అయితే అవి బుక్ కాకపోవడంతో కృష్ణారావు అనే వ్యక్తిని వారు ఆశ్రయించి టోకెన్లు కొనుగోలు చేశారు. వాటిని తీసుకుని ఆ 14 మంది తిరుమలకు చేరుకున్నారు.
తీరా తిరుమలకు వచ్చిన తర్వాత వారికి అసలు విషయం అర్థమైంది. శ్రీవారి సేవకు ఎలాంటి టోకెన్లు ఉండవి, అవి ఉచితమని తెలిసి అంతా నాలుక్కరుచుకున్నారు. దీంతో శ్రీవారి సేవకు తాము కృష్ణారావు అనే వ్యక్తికి ఒక్కొక్కరం రూ. 800 చొప్పున చెల్లించి, టోకెన్లు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు తెల్పడంతో.. వారు కృష్ణారావుపై కేసు నమోదు చేశారు. కృష్ణారావు శ్రీవారి సేవ టోకెన్లతోపాటు ఇతర దర్శన టికెట్లు కూడా భక్తులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణారావును గాలించే పనిలో పడ్డారు.
పోలీసుల అదుపులో వైట్ కాలర్ దళారీ
ఇదే తరహాలో కొన్ని రోజుల క్రితం తిరుమల శ్రీవారి భక్తుల (Devotees )ను మోసం చేసిన వైట్ కాలర్ దళారీ (White Collar Broker)ని వన్ టౌన్ పోలీసులు (Police) అదుపులోకి (Arrest) తీసుకున్నారు. శ్రీవారి భక్తులకు అభిషేక దర్శనాలు కల్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసిన దళారి రమణ ప్రసాద్ (Raman Prasad)పై నాలుగు రాష్ట్రాలలో కేసులు వున్నట్లు సమాచారం. తిరుమలలోనే పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. 2018 లోను రమణ ప్రసాద్‌ను పోలీసులు అరేస్ట్ చేసారు. గత ఏడాది డిసెంబర్‌లో బెంగళూరుకు చెందిన భక్తులకు వస్త్రం టిక్కెట్టు ఇప్పిస్తానని రూ. 4 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదైంది. అతనికోసం రెండు నెలలుగా గాలిస్తున్న వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో జీబీఎస్ కేసులు.. ముగ్గురు మృతి
సీఆర్ పాటిల్‌ను కలిసిన చంద్రబాబు, పవన్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 21 , 2025 | 02:05 PM