మూడు టన్నుల రేషన్ బియ్యం సీజ్
ABN, Publish Date - May 02 , 2025 | 01:13 AM
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి నెల్లూరుకు తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి(నేరవిభాగం), మే 1(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి నెల్లూరుకు తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ సీఐ మురళీమోహన్ వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పలమనేరు, బైరెడ్డిపల్లి, గంగవరం, చిత్తూరు, బంగారుపాళ్యం, తిరుపతి జిల్లా తిరుపతి, పాకాల, చంద్రగిరి నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని వ్యాను ద్వారా నెల్లూరుకు తరలిస్తున్నారు. తిరుపతి సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ సురేంద్రకు అందిన సమాచారం మేరకు వెస్ట్ సీఐ మురళీమోహన్ నేతృత్వంలో పోలీసులు, సివిల్ సప్లయిస్ సిబ్బంది కృష్ణాపురం ఠానా వద్ద పట్టుకున్నారు. మూడు టన్నుల రేషన్ బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. బైరెడ్డిపల్లి మండలం బెల్లంమడుగు గ్రామానికి చెందిన ఎం.కిషోర్ రెడ్డి హస్తమున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వెస్ట్ సీఐ కేసు నమోదు చేశారు.
Updated Date - May 02 , 2025 | 01:13 AM