ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రాకకు తిమ్మరాజుపల్లె సిద్ధం

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:43 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన 2వ తేదీకి ఖరారైంది. ఆ రోజు జరగనున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారంనాటి సాయంత్రమే ఆయన కుప్పం రానున్నారు. టీడీపీ అధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, అందించిన పాలన గురించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని తిమ్మరాజుపల్లెలో సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం తుమ్మిశి వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రయోజకాలను పంపిణీ చేయడమే కాక, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పంలో అధికారుల హడావుడి అధికంగా ఉంది. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, స్థానిక అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సభా వేదిక ప్రాంగణంలో అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

  • ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట

26కుటుంబాలకు బాబు పలకరింపు

  • తుమ్మిశిలో సభ,పథకాల పంపిణీ,

అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

కుప్పం/శాంతిపురం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన 2వ తేదీకి ఖరారైంది. ఆ రోజు జరగనున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారంనాటి సాయంత్రమే ఆయన కుప్పం రానున్నారు. టీడీపీ అధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, అందించిన పాలన గురించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని తిమ్మరాజుపల్లెలో సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం తుమ్మిశి వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రయోజకాలను పంపిణీ చేయడమే కాక, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పంలో అధికారుల హడావుడి అధికంగా ఉంది. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, స్థానిక అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏలూరు పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాఫ్టర్‌లో బయల్దేరి, శాంతిపురం మండలం తుమ్మిశి రోడ్డులోని డుంకుమానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. అక్కడనుంచి నేరుగా కడపల్లె పంచాయతీ పరిధిలోని స్వగృహానికి చేరుకుంటారు. ఆ రాత్రి ఇక్కడే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం 8 గంటలకల్లా స్వగృహం ఉన్న తిమ్మరాజుపల్లెకు చేరుకుని ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే 26 ఇళ్లను ఎంపిక చేశారు. ఆయా ఇళ్లకు సీఎం వెళ్తారు. వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, లబ్ధి గురించి ఆరా తీస్తారు. ప్రభుత్వపరంగా అమలవుతున్న పథకాల గురించి వివరిస్తారు. సాదకబాదకాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తారు. తెలుగుదేశం పార్టీపరంగా 60మంది ఓటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన కుటుంబ సాధికార సమితి (కేఎస్‌ఎస్‌) పరిధిలోకి వచ్చే ఇళ్లనే సీఎం సందర్శించేలా స్థానిక రాజకీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం తుమ్మిశి మోడల్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనే సీఎం వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు.ఎలక్ట్రిక్‌ ఆటోలు, ఎలక్ట్రిక్‌ సైకిళ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఏస్‌ ఇండస్ట్రీస్‌, ఈ- రాయిస్‌, ఎస్వీఎఫ్‌ సోయా కంపెనీలతో కడా తరఫున ఎంవోయూలపై సంతకాలు చేస్తారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రి చేరుకుని ప్రభుత్వ భాగస్వామ్యంతో టాటా కన్సల్టెన్సీ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ (డీఐఎన్‌సీ)ను ప్రారంభిస్తారు.అదేరోజు సాయంత్రం కుప్పంనుంచి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

ముఖ్యమంత్రి కుప్పం పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్న డుంకుమానుపల్లె, ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించనున్న తిమ్మరాజుపల్లె, బహిరంగ సభ జరగనున్న తుమ్మిశి మోడల్‌ స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన సభావేదిక ప్రాంగణాలను సందర్శించి అధికార యంత్రాంగానికి తగు సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లు, రూట్‌ మ్యాప్‌, సంబంధిత అంశాలపై అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌ (ఏఎస్‌ఎల్‌)లో భాగంగా ముఖ్యమంత్రి పర్యటనకు తగు భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో తిమ్మరాజుపల్లెలో కానీ, బహిరంగ సభలో పాల్గొనే ప్రజలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లతో సిద్ధం కావాలని సూచించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ భద్రత, వైద్య సేవల మెరుగుదలపై అధికారులకు సూచనలిచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డీపీవో ప్రభాకర రావు, డీపీవో ప్రభాకర్‌, ఏఎస్పీ నందకిశోర్‌, కుప్పం డీఎస్పీ పార్థసారథి, ఆర్డీవో శ్రీనివాసరాజు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

తిమ్మరాజుపల్లె దశ మారింది

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిమ్మరాజుపల్లె దశ మారిపోతోంది. కోటి రూపాయల వ్యయంతో గ్రామం రూపురేఖలను మార్చుతున్నారు. ఈ గ్రామంలోనే ఎంపిక చేసిన 26 ఇళ్లకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఇల్లే లేకుండా గుడారంలో నివాసమున్న నిరుపేద రాజు ఇంటినుంచీ ధనవంతుల దాకా ఈ 26 మందిలో ఉన్నారు. అన్ని ఇళ్లకు అధికారులు వరుస ప్రకారం నెంబర్లు ఇచ్చారు. మంగళవారం సోమవారం ఉదయంనుంచి కరెంటు స్తంభాలు లేనిచోట్ల వాటిని నిలబెడుతున్నారు. బల్బులు మారుస్తున్నారు. ఇంటింటికీ తాగునీటి పైపులైన్లు నిర్మించి, పంచాయతీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారినుంచి తిమ్మరాజుపల్లెకు సుమారు 3 కిలోమీటర్ల తారు రోడ్డును పునరుద్ధరించారు. ఊరంతా పరిశుభ్రం చేశారు.

ఫ సీఎం పర్యటన షెడ్యూల్‌

మంగళవారం సాయంత్రం

5.25 పీఎం - శాంతిపరం మండలం డుంకుమానుపల్లె హెలిప్యాడ్‌కు రాక

5.35 పీఎం - శాంతిపురం కడపల్లె వద్ద ఉన్న స్వగృహానికి చేరిక.రాత్రి బస

బుధవారం

8ఏఎం టు 10.45 ఏఎం - తిమ్మరాజుపల్లెలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం

10.55 ఏఎం టు 1.50 పీఎం - తుమ్మిశి మోడల్‌ స్కూల్‌ సమీపంలో సభ, వివిధ ప్రభుత్వ, సంక్షేమ పథకాల ప్రారంభం, లబ్ధిదారులకు పంపిణీలు

1.55 పీఎం టు 2.55 - కడపల్లెలోని స్వగృహం

3.05 పీఎం టు 4.05 పీఎం - కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ ప్రారంభం

4.20 పీఎం - డుంకుమానుపల్లె హెలిప్యాడ్‌ చేరుకుని తిరుగు ప్రయాణం

Updated Date - Jul 01 , 2025 | 01:43 AM