విచారణ అధికారులపైనే విచారణ
ABN, Publish Date - May 01 , 2025 | 01:54 AM
చిత్తూరు కలెక్టరేట్‌లోని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) కార్యాలయంలో పనిచేస్తుండిన ఒక ఉద్యోగిపై విచారణ జరిపి నివేదిక అందించడంలో తీవ్ర జాప్యం చేశారన్న కారణంపై విచారణ అధికారులపైనే విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
-తీవ్ర జాప్యమే కారణం
నెలరోజుల్లో నివేదికకు ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు కలెక్టరేట్‌లోని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) కార్యాలయంలో పనిచేస్తుండిన ఒక ఉద్యోగిపై విచారణ జరిపి నివేదిక అందించడంలో తీవ్ర జాప్యం చేశారన్న కారణంపై విచారణ అధికారులపైనే విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సీపీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండిన పి. శశికర్ విధులకు గైర్హాజరు కావడంపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు నమోదు చేయడంలో ముగ్గురు అధికారులు అసాధారణ జాప్యం చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. దాంతో అప్పటి సీపీవో కార్యాలయ జాయింట్ డైరెక్టర్ సీహెచ్‌వీఎ్‌స భాస్కర్ శర్మ, మాజీ సీపీవో డి. ఆనంద నాయక్, మాజీ సీపీవో (ఎఫ్‌ఏసీ) ఎల్. అప్పలకొండలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ (ఎం్క్షఆర్) డైరెక్టర్ ఆర్. రాంబాబు, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఎం. మోహన్‌రావులను విచారణ అధికారులుగా నియమించింది. నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ముగ్గురు అధికారుల్లో భాస్కర్ శర్మ ఇదివరకే రిటైరవగా, ఆనంద్ నాయక్ ఈ ఏడాది జూన్ 30న రిటైర్ కానున్నారు.
Updated Date - May 01 , 2025 | 01:54 AM