ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రగతి బాటలో తొలి అడుగు

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:58 AM

ఐదేళ్ల అథోగతిలోంచి జిల్లా కోలుకుంటోంది. వైసీపీ అరాచక పాలనలో సకల రంగాలూ జిల్లాలో చతికిలపడ్డాయి.ఇసుక, గ్రావెల్‌, క్వారీల కొల్లగొట్టుడు పనుల్లో మునిగిపోయిన వైసీపీ నేతలు జిల్లా యువత భవిష్యత్తును గాలికొదిలేశారు. కొత్త పరిశ్రమల కోసం ప్రయత్నం కూడా లేదు. పంపకాల పథకాల గొప్పలు చెప్పి అభివృద్దిని అటకెక్కించేశారు. వ్యవసాయ పఽథకాలు నిలిపేశారు. ఏనుగులతో సతమతమవుతున్న జనానికి భరోసా ఇవ్వలేదు. ఏడాది కిందట సరిగ్గా ఈరోజు.. జూన్‌ 12న చంద్రబాబు సారఽథ్యంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక జిల్లా అభివృద్ధి చిత్రపటం రూపు మారడం మొదలైంది.

కుప్పం బ్రాంచి కెనాల్‌కు కాంక్రీట్‌ పనులు

ఏడాది పాలన

ఐదేళ్ల అథోగతిలోంచి జిల్లా కోలుకుంటోంది. వైసీపీ అరాచక పాలనలో సకల రంగాలూ జిల్లాలో చతికిలపడ్డాయి.ఇసుక, గ్రావెల్‌, క్వారీల కొల్లగొట్టుడు పనుల్లో మునిగిపోయిన వైసీపీ నేతలు జిల్లా యువత భవిష్యత్తును గాలికొదిలేశారు. కొత్త పరిశ్రమల కోసం ప్రయత్నం కూడా లేదు. పంపకాల పథకాల గొప్పలు చెప్పి అభివృద్దిని అటకెక్కించేశారు. వ్యవసాయ పఽథకాలు నిలిపేశారు. ఏనుగులతో సతమతమవుతున్న జనానికి భరోసా ఇవ్వలేదు. ఏడాది కిందట సరిగ్గా ఈరోజు.. జూన్‌ 12న చంద్రబాబు సారఽథ్యంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక జిల్లా అభివృద్ధి చిత్రపటం రూపు మారడం మొదలైంది. జగన్‌ జమానాలో గతుకులమయమైన రోడ్లకు కొత్త ప్రభుత్వం అతుకులు వేయాల్సివచ్చింది. గ్రామీణ రోడ్ల నిర్మాణం పెద్దఎత్తున ప్రారంభం అయ్యింది. జిల్లా ప్రజలకు నమ్మకమిచ్చేలా సాగిన ఏడాది పాలన విశేషాలు..

-చిత్తూరు, ఆంధ్రజ్యోతి

ఫ రహదారులకే రూ.222 కోట్లు

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కొత్త రోడ్ల మంజూరు విషయం పక్కన పెడితే పాతరోడ్ల నిర్వహణ , మరమ్మతులను కూడా పట్టించుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడేనాటికి జిల్లాలో రోడ్లన్నీ చిధ్రమైపోయి ఉన్నాయి. రూ.22 కోట్లతో వాటన్నింటికీ మరమ్మతులు చేయించారు.

- రూ.22 కోట్లతో రహదారులకు మరమ్మతులు

- రూ.6 కోట్లతో చిత్తూరు- గుడియాత్తం రోడ్డు అభివృద్ధి

- రూ.2.35 కోట్లతో చిత్తూరు- గుడిపాల రోడ్డు అభివృద్ధి

-ఉపాధి హామీ నిధులు రూ.90 కోట్లతో సీసీ రోడ్లు, రూ.30 కోట్లతో బీటీ రోడ్లు పూర్తి.

- రూ.4 కోట్లతో చిత్తూరు ఫారెస్టు రోడ్డు అభివృద్ధి

- రూ.15 కోట్ల ఉపాధి గ్రాంట్లతో పీఆర్‌ రోడ్లకు టెండర్లు

- రూ.53 కోట్ల ప్రత్యేక నిధులతో కుప్పం నియోజకవర్గంలో 23 రహదారుల అభివృద్ధి

ఫ ఉద్యాన ప్రోత్సాహం పునరుద్ధరణ

ఉద్యాన పంటల్ని సాగు చేసుకునే రైతులు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం వస్తూనే రూ.20 కోట్లతో ఫార్మ్‌పాండ్స్‌, షెడ్ల నిర్మాణంలో, సాగులో 60 శాతం రాయితీ ఇచ్చింది. ఈ ఏడాది 5 వేల ఎకరాలకుపైగా ఉద్యాన పంటల సాగును పెంచింది.

డ్రిప్‌ ఇరిగేషన్‌కు రూ.వంద కోట్లు

సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ ఏడాదిలో 10 వేల హెక్టార్లలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానం ద్వారా పంటల్ని సాగు చేశారు. ప్రభుత్వం 90 శాతం రాయితీతో రూ.వంద కోట్లను ఖర్చు చేసింది.

గోకులాల కోసం రూ.45 కోట్లు

పాడి రంగాన్ని ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం రాయితీతో గోకులం షెడ్లను నిర్మించింది.

- మంజూరైన షెడ్లు: 2134

- కేటాయించిన నిధులు: రూ.45 కోట్లు

- పూర్తయినవి: 1500

పెన్షన్లకు రూ.1502 కోట్లు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్ల సొమ్మును రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. దీంతో పాటు అన్నిరకాల పెన్షన్లూ పెరిగాయి.

- జిల్లాలో పెన్షన్‌దారులు: 2.66 లక్షలు

- నెలకు అందిస్తున్న పెన్షన్‌: రూ.122 కోట్లు

- తొలి నెల అందించింది: రూ.160 కోట్లు

- ఈ ఏడాది పెన్షన్లకు ఖర్చు: రూ.1502 కోట్లు

ఉచిత సిలిండర్లకు రూ.40.53 కోట్లు

ఎన్నికల హామీ మేరకు గతేడాది నవంబరు నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున ఉచితంగా అందిస్తున్నారు.

- నవంబరు 2024 నుంచి మార్చి 2025 వరకు: 3.53 లక్షల మందికి రూ.28.57 కోట్ల సబ్సిడీ

- ఏప్రిల్‌ 2025 నుంచి ఇప్పటివరకు: 1.41 లక్షల మందికి రూ.11.96 కోట్ల సబ్సిడీ

మామిడి రైతులకు రూ.200 కోట్లతో మద్దతు

ఐదేళ్ల పాటు మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని అనుభవించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం రైతుల బాధను అర్థం చేసుకుని వాళ్లు రోడ్డెక్కి నిరసనలు చేయకముందే సీఎం చంద్రబాబు మద్దతు ధర రూ.12ను ప్రకటించారు. అందులో ప్రభుత్వం కిలోకు రూ.4 సబ్సిడీ అందిస్తోంది.

- జిల్లాలో తోతాపురి మామిడి సాగు: 99,738 ఎకరాలు

- సాధారణ పరిస్థితుల్లో దిగుబడి: 4 లక్షల టన్నులు

- ఈ సారి దిగుబడి అంచనా: 4.98 లక్షల టన్నులు

- రూ.4 సబ్సిడీతో ప్రభుత్వం అందించే సాయం: రూ.200 కోట్లు

హంద్రీనీవా కాలువల లైనింగ్‌కు రూ.516 కోట్లు

జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రతిష్టాత్మక హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వైసీపీ ఐదేళ్లూ నిర్లక్ష్యం చేసింది. ఎన్నికలకు ముందు నీళ్లు వదులుతున్నట్లు నాటకాలాడిన జగన్‌ నవ్వులపాలయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెద్దఎత్తున నిధులిచ్చి పనుల్ని వేగవంతం చేసింది. కెనాల్స్‌కు కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు కూడా చేస్తోంది. జూలైలో నీళ్లను విడుదల చేయనున్నారు.

- పుంగనూరు బ్రాంచి కెనాల్‌ లైనింగ్‌కు: రూ.319 కోట్లు

- ఆయకట్టు: 37300 ఎకరాలు

- నిండే చెరువులు: 125

- కుప్పం కెనాల్‌ లైనింగ్‌కు: రూ.197 కోట్లు

- ఆయకట్టు: 6300 ఎకరాలు

- నిండే చెరువులు: 110

ఇరిగేషన్‌లో రూ.30 కోట్లు

పుంగనూరు నియోజకవర్గంలోని పది చెరువుల్ని రూ.5 కోట్లతో మరమ్మతు చేశారు. 2019లో ఆగిపోయిన నీరు- చెట్టు బిల్లుల్లో రూ.20 కోట్లకుపైగా మంజూరు చేయగా.. ఇంకా బిల్లుల్ని అప్‌లోడ్‌ చేస్తున్నారు.

రూ.5 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు కేటాయించిన రూ.5 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌తో నాలుగు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు మరమ్మతులు చేయించారు. శ్మశాన వాటికలను బాగు చేశారు. రూ.10 కోట్ల ప్రత్యేక నిధులతో జిల్లాలో 48 ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను బాగు చేసే పనులు పురోగతిలో ఉన్నాయి.

పారిశ్రామిక పార్కుల ఏర్పాటు దిశగా..

నియోజకవర్గానికో ఎంఎ్‌సఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ఇటీవల మంత్రిమండలి ఆమోదించింది. ఈ ఏడాదిలో కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో 35 ఎకరాల్లో, పలమనేరులో 5 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల్ని ప్రారంభించారు. పూతలపట్టులో వంద ఎకరాలు, జీడీనెల్లూరులో 70 ఎకరాల భూమిని పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీ గుర్తించింది.

8 వేల మంది రైతులకు శిక్షణ.. మన వద్దే..

రాష్ట్రంలో తొలిసారి మన జిల్లాలో స్కిల్‌ ఆఫ్‌ చిత్తూరు పేరుతో రైతులకు.. ప్రాథమిక డిజిటల్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా రైతులకు స్మార్ట్‌ ఫోన్‌ వాడకం, వాతావరణ సూచనల తనిఖీ, మార్కెట్‌ ధరల్ని పోల్చడం, డిజిటల్‌ చెల్లింపులు, వ్యవసాయ సలహాల కోసం సంప్రదించడం.. వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. తొలుత 8 గ్రామ సచివాలయాల్లో ప్రారంభించగా.. ప్రస్తుతం 18 మండలాల్లోని 78 సచివాలయాల పరిధిలో 8 వేల మందికిపైగా శిక్షణ ఇచ్చారు.

ఏనుగుల దాడులకు చెక్‌

నిత్యం ఏదో ఓ ప్రాంతంలో ఏనుగులు పంటలపై దాడులు చేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక దృష్టి సారించి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మరీ మన జిల్లాకు నాలుగు కుంకీ ఏనుగుల్ని తెప్పించారు. పలమనేరు సమీపంలో 50 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఎలిఫెంట్‌ క్యాంపులో వీటిని ఉంచారు. మదపుటేనుగుల్ని ఈ కుంకీ ఏనుగులు అదుపు చేసి అడవిలోకి తరిమేస్తాయి.

అర్జీల పరిష్కారంలో సంతృప్తి

ఈ ఏడాది కలెక్టరేట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ ద్వారా సుమారు 53 వేల అర్జీలు అందాయి. అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 80 శాతానికిపైగా పరిష్కరించారు.కుప్పంలో చేసిన సర్వేలో 44 శాతం మంది అర్జీదారులు తమ సమస్యలు సరిష్కారమయ్యాయని సంతృప్తి చెందారు. 33 శాతం మంది రిజెక్ట్‌ చేశారని బాధ పడ్డారు.

ఏళ్లుగా పెండింగులో ఉన్న 400 ఆర్బిట్రేషన్‌ కేసుల్ని ఈ ఏడాదిలో క్లియర్‌ చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం సంతృప్తిగా లేదని ఆర్బిట్రేషన్‌ వేస్తుంటారు.

ఈ ఏడాది జిల్లాస్థాయిలో 200 వరకు అంగన్వాడీ వర్కర్లను, వైద్యఆరోగ్యశాఖల్లో ఉద్యోగాలను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా భర్తీ చేశారు. వైసీపీ హయాంలో ఏ శాఖల్లో నియామకాలు చేపట్టినా తీవ్ర ఆరోపణలు వచ్చేవి.

893 పనులు.. రూ.131.41 కోట్లు

నేడు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం జిల్లాలో పెద్దఎత్తున అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.80.95 కోట్ల విలువ చేసే 816 పనుల్ని ప్రారంభించనుండగా.. రూ.50.46 కోట్ల అంచనాతో 77 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. కలెక్టర్‌ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సర్పంచులు, ఎంపీపీలు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Updated Date - Jun 12 , 2025 | 12:59 AM