ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

23న టీడీపీ పార్లమెంటు మినీ మహానాడు

ABN, Publish Date - May 20 , 2025 | 02:16 AM

తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు స్థాయి మినీ మహానాడు ఈనెల 23వ తేదీన జరగనుంది. అదే రోజు ఉదయం సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్‌ మినీ మహానాడు జరగనుండగా తిరుపతి పార్లమెంటుతో కలిపి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ మినీ మహానాడు కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. ఈనెల 27, 28, 29 తేదీలలో కడపలో టీడీపీ మహానాడు జరగనున్న నేపథ్యంలో.. ఆలోపే జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు స్థాయి మినీ మహానాడు కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇప్పటికే సర్వేపల్లి, శ్రీకాళహస్తి, గూడూరు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు ముగిశాయి. తిరుపతి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి సెగ్మెంట్లు పెండింగు వున్నాయి. జిల్లాకే చెందినప్పటికీ చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి సెగ్మెంట్‌ మినీ మహానాడు నేడు మంగళవారం తిరుపతి రూరల్‌ మండలంలో ఎమ్మెల్యే పులివర్తి నాని నివాసం సమీపంలో జరగనుంది.

  • అదే రోజు తిరుపతి, సత్యవేడు సెగ్మెంట్లు కూడా

  • నేడు చంద్రగిరి.. 21న సూళ్లూరుపేట.. 22న వెంకటగిరి

తిరుపతి, మే 19 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు స్థాయి మినీ మహానాడు ఈనెల 23వ తేదీన జరగనుంది. అదే రోజు ఉదయం సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్‌ మినీ మహానాడు జరగనుండగా తిరుపతి పార్లమెంటుతో కలిపి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ మినీ మహానాడు కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. ఈనెల 27, 28, 29 తేదీలలో కడపలో టీడీపీ మహానాడు జరగనున్న నేపథ్యంలో.. ఆలోపే జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు స్థాయి మినీ మహానాడు కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇప్పటికే సర్వేపల్లి, శ్రీకాళహస్తి, గూడూరు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు ముగిశాయి. తిరుపతి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి సెగ్మెంట్లు పెండింగు వున్నాయి. జిల్లాకే చెందినప్పటికీ చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి సెగ్మెంట్‌ మినీ మహానాడు నేడు మంగళవారం తిరుపతి రూరల్‌ మండలంలో ఎమ్మెల్యే పులివర్తి నాని నివాసం సమీపంలో జరగనుంది. సూళ్లూరుపేట నియోజకవర్గ మినీ మహానాడు ఈనెల 21న ఉదయం నాయుడుపేటలోను.. వెంకటగిరి మినీ మహానాడు 22వ తేదీ సాయంత్రం వెంకటగిరిలో నిర్వహిస్తున్నారు. సత్యవేడు మినీ మహానాడు ఈనెల 23న ఉదయం జరగనుంది. అక్కడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌లో వున్నందున పార్టీ పరిశీలకులు చంద్రశేఖర్‌ నాయుడు, శ్రీపతి బాబు ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుపతి పార్లమెంటు స్థాయి మినీ మహానాడు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జరపనున్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన మినీ మహానాడు కూడా అందులో భాగంగానే నిర్వహించే అవకాశముంది.

Updated Date - May 20 , 2025 | 02:17 AM