హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ సస్పెన్షన్
ABN, Publish Date - Jul 15 , 2025 | 02:16 AM
జిల్లా ఇన్‌ఛార్జి హౌసింగ్ పీడీ భూక్యా గోపాల్ నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఆయనతో పాటు అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ వి.సాంబశివయ్య కూడా సస్పెండయ్యారు.
చిత్తూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి):జిల్లా ఇన్‌ఛార్జి హౌసింగ్ పీడీ భూక్యా గోపాల్ నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఆయనతో పాటు అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ వి.సాంబశివయ్య కూడా సస్పెండయ్యారు. గోపాల్ నాయక్ గతంలో పీలేరులో హౌసింగ్ డీఈఈగా, రాయచోటి ఈఈగా పనిచేశారు. ఈ ఏడాది జనవరి నుంచీ చిత్తూరు జిల్లా హౌసింగ్ పీడీగా విధులు నిర్వర్తిస్తున్నారు.గోపాల్ నాయక్, సాంబ శివయ్య రాయచోటిలో గతంలో రాయచోటిలో పని చేస్తుండగా తమ సబార్డినేట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అనగాని శ్రీహరిని బదిలీ చేయకుండా ఉంచేందుకు లంచం డిమాండ్ చేశారని వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Jul 15 , 2025 | 02:16 AM