ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాయుడు మిలటరీ హోటల్‌లో శ్రీవారి గర్భాలయ నమూనా సెట్‌

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:35 AM

తిరుమల శ్రీవారి గర్భాలయ తరహాలో నమూనా ఆలయ సెట్టింగు వేసి నాన్‌వెజ్‌ విక్రయిస్తున్న రాయుడు మిలటరీ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి జనసేన నేత కిరణ్‌రాయల్‌ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వినతిపత్రాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వ్యాపారాలకు వాడుకుంటున్న వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి నుంచి వైజాగ్‌కు వెళ్లే హైవేలో రాయుడు మిలటరీ హోటల్‌లో శ్రీవారి గర్భాలయ నమూనా సెట్టింగ్‌ వేశారన్నారు. అందులో జయ విజయలతో పాటు శ్రీవారి విగ్రహాన్నీ ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ‘తిరుమల అన్నప్రసాదం తరహాలోనే మేమూ పెడుతున్నాం అని ఆ హోటల్‌ నిర్వాహకుడు అంటున్నాడు. ఓరెయ్‌ వెదవ. మేము నాన్‌వెజ్‌ పెడుతున్నామా? ప్యూర్‌ వెజిటేరియన్‌ పెడుతున్నాం.

అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వినతిపత్రం అందజేస్తున్న కిరణ్‌ రాయల్‌

  • మాంసాహారం విక్రయిస్తున్న హోటల్‌పై చర్యలు తీసుకోండి

  • టీటీడీ అదనపు ఈవోకు కిరణ్‌రాయల్‌ ఫిర్యాదు

తిరుమల, జూన్‌30(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి గర్భాలయ తరహాలో నమూనా ఆలయ సెట్టింగు వేసి నాన్‌వెజ్‌ విక్రయిస్తున్న రాయుడు మిలటరీ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి జనసేన నేత కిరణ్‌రాయల్‌ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వినతిపత్రాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వ్యాపారాలకు వాడుకుంటున్న వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి నుంచి వైజాగ్‌కు వెళ్లే హైవేలో రాయుడు మిలటరీ హోటల్‌లో శ్రీవారి గర్భాలయ నమూనా సెట్టింగ్‌ వేశారన్నారు. అందులో జయ విజయలతో పాటు శ్రీవారి విగ్రహాన్నీ ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ‘తిరుమల అన్నప్రసాదం తరహాలోనే మేమూ పెడుతున్నాం అని ఆ హోటల్‌ నిర్వాహకుడు అంటున్నాడు. ఓరెయ్‌ వెదవ. మేము నాన్‌వెజ్‌ పెడుతున్నామా? ప్యూర్‌ వెజిటేరియన్‌ పెడుతున్నాం. వేంకటేశ్వర స్వామి భక్తులంటే ఎలా కనిపిస్తున్నారు నీకు’ అంటూ ఆ హోటల్‌ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ హోటల్‌లో నాన్‌వెజ్‌ వాసన వస్తుంటే.. మరోవైపు నమూనా సెట్టింగులో శ్రీవారి విగ్రహానికి హారతి ఇస్తున్నారంటూ ఆవేదనతో అమెరికా, జర్మనీ దేశాల్లోని భక్తుల నుంచీ తమకు వీడియోల సహా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. 24 నుంచి 48 గంటల్లోపు ఆలయ నమూనాను తొలగించకుంటే శ్రీవారి భక్తులు దాడి చేస్తారని హెచ్చరించారు. టీటీడీలో ప్రత్యేకంగా ఓ వింగ్‌ను ఏర్పాటు చేసి సోషల్‌ మీడియాపై నిఘా ఉంచాలని కోరారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ అధికారులతోనూ టీటీడీ అధికారులు మాట్లాడారని, రాయుడు మిలటరీ హోటల్‌ లైసెన్స్‌ను రద్దు చేయిస్తామన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 01:35 AM