నౌకా నిర్మాణ కేంద్రానికి స్థల పరిశీలన
ABN, Publish Date - May 22 , 2025 | 02:15 AM
వాకాడు మండలం దుగరాజపట్నం సముద్రతీరంలో చేపట్టనున్న నౌకా నిర్మాణ కేంద్రానికి తహసీల్దారు రామయ్య, సర్వేయర్ శకుంతల బుధవారం ప్రాథమికంగా స్థల పరిశీలన చేపట్టారు.
తూపిలిపాళెంలో హేచరీ వద్ద వివరాలు నమోదు చేసుకుంటున్న తహసీల్దారు రామయ్య
వాకాడు, మే 21 (ఆంధ్రజ్యోతి): వాకాడు మండలం దుగరాజపట్నం సముద్రతీరంలో చేపట్టనున్న నౌకా నిర్మాణ కేంద్రానికి తహసీల్దారు రామయ్య, సర్వేయర్ శకుంతల బుధవారం ప్రాథమికంగా స్థల పరిశీలన చేపట్టారు. దీనికి 2700 ఎకరాలు కావాల్సి ఉండగా, ఇప్పటికే 400 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని తహసీల్దారు తెలిపారు. తూపిలిపాళెం తీరంలో 14 హేచరీలకు సంబంధించి 150 ఎకరాలు ఉన్నాయని, ఆయా యాజమాన్యాలతో మాట్లాడామన్నారు. వాగుర్రు, వల్లమేడు, పామాంజిలోని రైతులను కలిసి భూములను ఇవ్వాలని కోరామని తహసీల్దారు చెప్పారు.
Updated Date - May 22 , 2025 | 02:15 AM