టీచర్ల సీనియర్ జాబితా విడుదల
ABN, Publish Date - May 12 , 2025 | 01:23 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీచర్ల సీనియారిటీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈవో వరలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, మే 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీచర్ల సీనియారిటీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈవో వరలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 హెచ్‌ఎంగా పదోన్నతుల నిమిత్తం ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, యాజమాన్యాలకు సంబంధించి రెండు దఫాలుగా అభ్యంతరాలు స్వీకరించి.. సవరించినట్లు పేర్కొన్నారు. తుది సీనియారిటీ జాబితాను సైట్‌లో ఉందని, ఉపాధ్యాయులు సరిచూసుకోవాలని కోరారు.
Updated Date - May 12 , 2025 | 01:23 AM