సచివాలయ ఉద్యోగులూ.. వదంతులను నమ్మొద్దు
ABN, Publish Date - Jun 22 , 2025 | 01:47 AM
ప్రభుత్వం ప్రకటించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మొద్దని రీజనల్ డైరక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీ) విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ ఆర్డీ సూచన
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మొద్దని రీజనల్ డైరక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీ) విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీల ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోని నిబంధనలకు లోబడి పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందన్నారు. సచివాలయ కార్యదర్శుల అర్హతలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మీకు అనుకూలంగా, కోరిన చోట్ల చేయిస్తామని చెప్పే మాటలను, వదంతులను నమ్మి, మోసపోవద్దని సూచించారు. కేవలం అర్హతను అనుసరించి నిబంధనల మేరకే బదిలీలు చేపట్టడం జరుగుతుందని వివరించారు.
Updated Date - Jun 22 , 2025 | 01:47 AM