ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

78మంది ఎండీయూ వాహన ఆపరేటర్లకు జీతాలు కట్‌

ABN, Publish Date - Apr 04 , 2025 | 01:24 AM

ఇంటింటికీ నిత్యావసర వస్తువులు అందించాల్సిన ఎండీయూ వాహన ఆపరేటర్లు విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణపై 78మందికి మార్చి నెల జీతాలు నిలుపుదల చేస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ నిత్యావసర వస్తువులు అందించాల్సిన ఎండీయూ వాహన ఆపరేటర్లు విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణపై 78మందికి మార్చి నెల జీతాలు నిలుపుదల చేస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లావ్యాప్తంగా 5.36లక్షల రేషన్‌కార్డుదారులకు చిత్తూరు డివిజన్‌లో 167 మంది, పలమనేరు డివిజన్‌లో 169 మంది ఎండీయూ వాహన ఆపరేటర్లు ప్రతినెలా 1-17 తేదీల మధ్య నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.18వేల జీతం, వారి సహాయకులకు రూ.3 వేల జీతం ప్రభుత్వం చెల్లిస్తోంది. కాగా ఫిబ్రవరి నెలలో కార్డుదారులకు నిత్యావసర వస్తువులు సక్రమంగా అందించని కారణంగా 78మంది ఎండీయూ వాహనాల ఆపరేటర్ల జీతాలను ఈ నెల ప్రారంభంలో నిలిపివేస్తూ డీఎస్వో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్వో శంకరన్‌ తెలిపారు.

Updated Date - Apr 04 , 2025 | 01:24 AM