ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

షార్‌లో రాకెట్‌ ప్రయోగం

ABN, Publish Date - Jul 30 , 2025 | 02:01 AM

షార్‌లో బుధవారం సాయంత్రం 5.40 గంటలకు రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 రాకెట్‌ ద్వారా ఇస్రో-నాసా ఉమ్మడిగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగ నేపథ్యంలో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. మన.. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అన్నీ సజావుగా సాగితే నిర్దేశిత సమయంలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 రాకెట్‌ ద్వారా నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి చేర్చనున్నారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు. జలమార్గంలో కోస్టల్‌ గార్డులచే.. షార్‌ చుట్టూ పక్కల అడవుల్లో సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బందితో జల్లెడ పడుతున్నారు.

కౌంట్‌డౌన్‌ జరిగే సమయంలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 రాకెట్‌

సూళ్లూరుపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): షార్‌లో బుధవారం సాయంత్రం 5.40 గంటలకు రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 రాకెట్‌ ద్వారా ఇస్రో-నాసా ఉమ్మడిగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగ నేపథ్యంలో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. మన.. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అన్నీ సజావుగా సాగితే నిర్దేశిత సమయంలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 రాకెట్‌ ద్వారా నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి చేర్చనున్నారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు. జలమార్గంలో కోస్టల్‌ గార్డులచే.. షార్‌ చుట్టూ పక్కల అడవుల్లో సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బందితో జల్లెడ పడుతున్నారు.

దేవాలయాల్లో పూజలు

తిరుమల/సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి: జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 ప్రయోగం విజయవంతం కావాలంటూ రాకెట్‌ నమూనాతో మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ దర్శించుకున్నారు. శ్రీవారి పాదాల వద్ద నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌, ఎన్‌ఏఆర్‌ఎల్‌ డైరెక్టర్‌ అమిత్‌కుమార్‌ పాత్ర, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస గుప్తా, చైర్మన్‌ పీఎస్‌ యశోద, సైంటిఫిక్‌ సెక్రటరీ జయంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడినీ దర్శించుకున్నారు. రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ప్రత్యేక పూజలు చేశారు. వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌, ఎంఎ్‌సఏ డిప్యూటీ డైరెక్టర్‌ గోపికృష్ణ పాల్గొన్నారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్‌ ప్రసన్న లక్ష్మి దర్శన ఏర్పాట్లు చేశారు.

‘నాసా-ఇస్రో సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ (నిసార్‌) ఉపగ్రహాన్ని జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నాం. ఇది భూఉపరితల పరిశీలన, వాతావరణం మార్పుల అధ్యయనానికి ఉపయోగపడుతుంది. కేవలం 12 రోజుల్లోనే భూగోళమంతా తిరిగే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ఉపగ్రహంలో ఇస్రో ఎస్‌-బ్యాండ్‌, నాసా ఎల్‌-బ్యాండ్‌ పేలోడ్స్‌ అమర్చాం. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన 40 రోజుల తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయి.

- వి.నారాయణన్‌, ఇస్రో చైర్మన్‌

‘గగనయాన్‌ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయి. అందుకు అవసరమైన వెహికల్స్‌ను, ఆస్ర్టోనాట్‌ టీంను సిద్ధం చేస్తున్నాం.

- ఉన్నికృష్ణన్‌ నాయర్‌, వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌

Updated Date - Jul 30 , 2025 | 02:01 AM