College: పీవీకేఎన్ డిగ్రీ కళాశాలకు న్యాక్ ‘ఎ’ గ్రేడ్
ABN, Publish Date - Feb 21 , 2025 | 01:50 AM
చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ‘ఎ’ గ్రేడ్ దక్కింది.
చిత్తూరు సెంట్రల్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి):చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ‘ఎ’ గ్రేడ్ దక్కింది.ఉన్నత విద్యా సంస్థలను అంచనా వేసి గుర్తింపు ఇచ్చే ప్రభుత్వ సంస్థ నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) త్రిసభ్య కమిటీ బృందం ఈనెల 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాక్ ‘ఎ’ గ్రేడ్ ఇచ్చినట్లు గురువారం రాత్రి వెల్లడైంది.దీంతో ఎస్వీయూ అఫ్లియేటెడ్ ‘ఎ’ గ్రేడ్ నుంచి అటానమస్ ‘ఎ’ గ్రేడ్‌కు కళాశాల గుర్తింపు ఎగబాకింది. కళాశాల ప్రిన్సిపాల్ జీవనజ్యోతి సారధ్యంలో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది కళాశాలలో సౌకర్యాల వివరాలను న్యాక్ బృందం ముందుంచారు.కళాశాలలో విద్యాప్రమాణాలతో పాటు అధ్యాపకుల నిబద్ధత, విద్యార్థుల ప్రతిభ, పరిశోధన, మౌలిక వసతులు, పూర్వ విద్యార్థుల సహకారం లాంటివి ఉత్తమ గ్రేడ్ రావడానికి ఉపకరించాయని ప్రిన్సిపాల్ జీవనజ్యోతి తెలిపారు.ఎంతో మంది విద్యార్థుల జీవన ప్రమాణాలను పెంచడానికి వేదికగా నిలబడిన కళాశాలకు తాను ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో ఈ గ్రేడ్ ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంతటి విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Feb 21 , 2025 | 01:50 AM